నా చేతిలో ఆమె చీర కొంగు.. సురేఖ నో చెప్తుందనుకున్నా: చిరంజీవి

నా చేతిలో ఆమె చీర కొంగు.. సురేఖ నో చెప్తుందనుకున్నా: చిరంజీవి
సరిగ్గా అప్పుడే లైట్స్ ఆన్ చేశారు. అంతే నా చేతిలో ఆమె చీర కొంగు ఉంది. చూసిన వాళ్లు ఏమనుకున్నారో అనిపించింది.

కొన్ని సినిమాలు కదిలిస్తాయి.. కన్నీళ్లు పెట్టిస్తాయి. అంకురం సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.. సినిమా చూస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్నావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలే ఉందన్నమాట.. నటీనటులు కూడా తాము యాక్ట్ చేస్తున్నామని తెలిసినా ఆ సందర్భాన్ని తెరపై చూసుకున్నప్పుడు వాళ్లకి కూడా కన్నీళ్లు వస్తుంటాయి. నటుడు చిరంజీవికి కూడా శంకరాభరణం చిత్రం చూసినప్పుడు అదే అనుభూతికి లోనైనట్లు సమంత హోస్ట్ చేస్తున్న సామ్‌జామ్ కార్యక్రమంలో వెల్లడించారు.

'కోతల రాయుడు' చిత్రంలో నేను, మంజు భార్గవి కలిసి పని చేశాను. ఆ పరిచయంతో ఆమె 'శంకరాభరణం' ప్రీమియర్ షోకు రమ్మని ఆహ్వానించింది. అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. గురువు విశ్వనాథ్, ఏడిద నాగేశ్వరరావుతో పరిచయం కూడా లేదు. అల్లు రామలింగయ్య కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు అక్కడికి వచ్చారు. ఆ సినిమా క్లైమాక్స్ సమయంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. నేను నా కన్నీళ్లు తుడుచుకోవడానికి కర్ఛీఫ్ కోసం వెతుకుతున్నాను.

ఇంతలో మంజుభార్గవి తన చీర కొంగును నాకు అందించింది. సరిగ్గా అప్పుడే లైట్స్ ఆన్ చేశారు. అంతే నా చేతిలో ఆమె చీర కొంగు ఉంది. చూసిన వాళ్లు ఏమనుకున్నారో అనిపించింది. కొంత కాలానికి నాకు సురేఖను ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. 'శంకరాభరణం' ప్రీమియర్ సమయంలో సురేఖ నన్ను చూసే ఉంటుంది.. కాబట్టి తప్పకుండా నో చెబుతుందని కంగారు పడ్డాను. కానీ తను మాత్రం నాతో పెళ్లికి అంగీకరించింది. 'ఖైదీ' చిత్రం సక్సెస్‌ని చవి చూసిన నేను 'వేట' చిత్రం కూడా విజయం సాధిస్తుందని నమ్మకం పెట్టుకున్నాను.

కానీ ఆ సినిమా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దాంతో చాలా బాధపడ్డాను. అలాగే 'విజేత' సినిమా చూసిన ప్రతి సారీ కన్నీళ్లు వస్తాయి అని చిరు వివరించారు. చివరిగా తనకు ఆటో బయోగ్రఫీ రాయాలనుందని.. దాని ద్వారా కొంత మందిలోనైనా ప్రేరణ నింపాలనే ఆశ ఉందని తన మనసులోని మాటను సామ్‌జామ్‌లో వెల్లడిచేశారు చిరంజీవి.

Tags

Read MoreRead Less
Next Story