కేంద్ర ఐటీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. జీతం నెలకు 60,000

కేంద్ర ఐటీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. జీతం నెలకు 60,000
ఇవి మూడేళ్లలోపు కాంట్రాక్ట్ పోస్టులు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.60,000 స్టైఫండ్ లభిస్తుంది.

కేంద్ర ఐటీ శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY)యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి మూడేళ్లలోపు కాంట్రాక్ట్ పోస్టులు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.60,000 స్టైఫండ్ లభిస్తుంది.

పలు అంశాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 30. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.meity.gov.in/ లేదా https://negd.gov.in/ చూడవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన వారు అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రీషియన్, రూరల్ డెవలప్ మెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్ మెంట్, సోషల్ వెల్ ఫేర్ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ డెవలప్ మెంట్, లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్, ఎన్విరాన్ మెంట్, లాజిస్టిక్స్, డేటా మేనేజ్ మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, స్టార్టప్, ఫైనాన్షియల్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇన్నోవేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బ్లాక్ చెయిన్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ ప్రైజ్ ఆర్కిటెక్చర్ లాంటి ఐటి ప్రాజెక్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు : 25

విద్యార్హత: ఏదైనా సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ లేదా 2 ఏళ్ల పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్ మెంట్ లేదా ఎల్ఎల్బీ లేదా సీఐ లేదా ఐసీడబ్ల్యూఏ, ఎంఫిల్, పీహెచ్ డీ లాంటి అదనపు విద్యార్హతలు, రీసెర్చ్ అనుభవం, పబ్లిష్డ్ పేపర్స్ లాంటివి ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయసు: 2020 సెప్టెంబర్ 15 నాటికి 32 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు విధానం: దరఖాస్తు ఫామ్ లింక్ నోటిఫికేషన్ లోనే ఉంటుంది. https://www.meity.gov.in/ వెబ్ సైట్ లో నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేయవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారం ఫ్రింట్ తీసుకొని చివరి తేదీ లోగా negdamin@digitalindia.gov.in మెయిల్ ఐడీకి పంపించాలి.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 30.

Tags

Read MoreRead Less
Next Story