MK Stalin: అందుకే కదయ్యా మీరు నెం.1 సీఎం అయ్యారు..! 14 ఏళ్లకే రాజకీయం..

MK Stalin (tv5news.in)

MK Stalin (tv5news.in)

MK Stalin: తమిళ రాజకీయాలు కొన్నేళ్ల వరకు మర్చిపోలేని ముద్ర వేసి వెళ్లిపోయారు కరుణానిధి.

MK Stalin: తమిళనాడులో ఎన్నో ఏళ్లు రాజ్యాన్ని ఏలిన కరుణానిధి కుమారుడే ఎంకే స్టాలిన్.. అంటే ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో లీడర్‌గా పనిచేసిన జోసెఫ్ స్టాలిన్ మీద ఇష్టంతో కరుణానిధి.. స్టాలిన్‌కు ఆ పేరు పెట్టారు. ఆ పేరు వల్లే ఆయనను చాలామంది స్కూళ్లలో చేర్చుకోలేదు కూడా.

స్టాలిన్‌ రాజకీయాల్లోకి రాకముందు ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే 1978లో 'నబిక్కైనచ్చతరం' అనే సినిమాను నిర్మించారు. అంతే కాకుండా 1988లో 'ఒరె రత్నం' అనే సినిమాలో నటించారు కూడా. కానీ రాజకీయ కుటుంబంలో పుట్టినందువల్ల మెల్లగా ఆయనకు కూడా రాజకీయాలు అలవాటు అయిపోయాయి. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చేలాగా ప్రోత్సహించాయి.

14 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోని ఎత్తు పల్లాలను దగ్గరుండి గమనించారు స్టాలిన్. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు తన తండ్రితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వానికి ఎదురెళ్లినందుకు అరెస్ట్ అయ్యారు కూడా. ఇక ఆయన రాజకీయ జీవితంలోకి పూర్తిగా ఎంటర్ అయ్యింది 1996లో. ఆ సంవత్సరం ఆయన చెన్నైకు 37వ మేయర్‌గా ఎన్నికయ్యి తమిళనాడు రాజధాని అభివృద్ధికి ఎంతో కృషిచేశారు.

కరుణానిధి మరణం తర్వాత డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ ఎన్నికయ్యారు. ఇక ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. దీంతో ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ను ఎన్నుకున్నారు. అప్పటినుండి ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలా అని స్టాలిన్ నిరంతరం తపన పడుతూనే ఉన్నారు.

ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం స్టాలిన్ పాటుపడుతూనే ఉన్నారు. ప్రజలకు ఏదైనా అవసరం వస్తే ఆయనే స్వయంగా వెళ్లి తెలుసుకుంటున్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే పరీష్కరిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని దగ్గరుండి చూసుకున్నారు. ఇలా ప్రజలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేంత దూరంలో ఉంటారు కాబట్టే ఎంకే స్టాలిన్ భారతదేశంలో మోస్ట్ పాపులర్ సీఎం జాబితాలో టాప్ 1గా నిలిచారు.

Tags

Read MoreRead Less
Next Story