మిస్టర్ కూల్‌ 'మహీ'కి ఏమైంది

మిస్టర్ కూల్‌ మహీకి ఏమైంది
శుక్రవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌ అభిమానులను నిరుత్సాహపరిచింది.

అరుపులు, కేకలతో జరగాల్సిన ఐపీఎల్ కరోనా కట్టుబాట్ల కారణంగా కామ్‌గా టీవీల్లో వీక్షిస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఎలా జరిగినా సంతోషమే.. ఐపీఎల్ జరగడమే మాక్కావాలని అని ఎదురు చూసిన ప్రేక్షకులు బుల్లితెరపైన కూడా బాగానే ఆస్వాదిస్తున్నారు. ఇక భారీ అంచనాలతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆదిలోనే తడబడడం మహి అభిమానులను కలచి వేస్తోంది. శుక్రవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌ అభిమానులను నిరుత్సాహపరిచింది. జట్టు విజయానికి ధోనీ చివరి వరకు కృషి చేశాడు. కానీ వేగంగా ఆడడంలో విఫలమయ్యాడు. 164 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది చెన్నై జట్టు. చివరికి 7 పరుగులతో ఓటమిని మూడగట్టుకుంది. అయితే ఆట మధ్యలో ధోనీ బాగా అలసిపోయాడు. వికెట్ల మధ్య చిరుతలా పరిగెట్టే ధోనీ ఒకానొక దశలో ఇక పరిగెత్తడం తన వల్ల కాదనే ధోరణికి వచ్చేశాడు. దీనిపై వివరణ ఇచ్చిన ధోనీ దుబాయ్‌లో ఉన్న పొడివాతావరణం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నాడు.

ఇక్కడి వాతావరణ పరిస్థితి కారణంగా గొంతు త్వరగా ఎండిపోతోంది. దాంతో దగ్గు బాగా వచ్చి ఇబ్బంది పడ్డానని తెలిపాడు. ఆ పరిస్థితిలో పరుగులు తీయడం కూడా కష్టంగా మారింది. మిడిల్ ఓవర్లలో బంతిని బలంగా బాదడం కష్టతరమైందని అన్నాడు. చాలా కాలం తరువాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయాం. లీడ్ మ్యాచ్‌లు కాబట్టి నడుస్తుంది. అదే నాకౌట్ దశలో అయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తదుపరి మ్యాచ్‌కు మా తప్పిదాలను సవరించుకుని బరిలోకి దిగుతాం అని ధోనీ తెలిపాడు. 2014 ఐపీఎల్ సీజన్ తరువాత చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడడం ఇదే తొలిసారి. ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనికి ఇది 194వ మ్యాచ్.

Tags

Read MoreRead Less
Next Story