అంబానీనా.. మజాకా.. గంటకి రూ.90 కోట్లు..

అంబానీనా.. మజాకా.. గంటకి రూ.90 కోట్లు..
కరోనా సమయంలో సామాజిక, ఆర్థిక, జెండర్ ఇన్-ఈక్వాలిటీ కూడా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

కరోనా సృష్టించిన కల్లోలంతో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్నో వ్యాపార సంస్థలు మూత పడ్డాయి. కొన్ని వ్యాపార దిగ్గజ సంస్థలకి మాత్రం కరోనా కలిసొచ్చింది. వ్యాపారం లాభాల పట్టి వారి సంపద పదింతలైంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏకంగా ప్రపంచ నెంబర్ వన్‌గా ఎదిగారు.

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద కూడా కనీవినీ ఎరుగని విధంగా పెరిగింది. ఓ గంటలో ముఖేష్‌కు వచ్చిన ఆదాయం ఓ సాధారణ వ్యక్తి సంపాదించాలంటే కనీసం 10వేల సంవత్సరాలు పడుతుందట.. ఆక్స్‌ఫామ్ ఇన్-ఈక్వాలిటీ నివేదిక ప్రకారం కరోనా సమయంలో ముఖేష్ సంపాదన భారీగా పెరిగింది. ఈ విషయాన్ని నివేదికలో పొందుపరిచారు. కరోనా సమయంలో సామాజిక, ఆర్థిక, జెండర్ ఇన్-ఈక్వాలిటీ కూడా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

ముఖేష్ అంబానీ ఆదాయం: కరోనా సమయంలో గంటకు రూ.90 కోట్లు ఆర్జించారు ముఖేష్ అంబానీ. ఆయన ఒక్కరిదే కాదు ప్రపంచంలోని కుబేరుల సంపాదన అలా కొండలా పెరిగిపోయింది. భారత కుబేరుల ఆదాయం ఈ కాలంలో 35 శాతం పెరిగింది.

2009 నుంచి చూస్తే 2020లో 90 శాతం పెరిగి 422.9 బిలియన్ డాలర్లుగా ఉంది. బిలియనీర్స్ ర్యాంకింగ్‌లో అమెరికా, చైనా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ తర్వాత భారత్ ఆరో స్థానంలో ఉంది. కరోనా సమయంలో భారత టాప్ 11 మంది కుబేరుల వద్ద పెరిగిన సంపదతో MAHATMA GANDHI NATIONAL RURAL EMPLOYMENT GUARANTEE SCHEME (MGNREGS)ను సులభంగా నిర్వహించవచ్చు. హెల్ మినిస్ట్రీకి పదేళ్లపాటు ఈ నగదు బదిలీ చేస్తే నిరాఘాటంగా స్కీమ్ రన్నవుతుంది.

దేశంలో 24 శాతం మంది ఆదాయం నెలకు రూ.3 వేల కంటే తక్కువ. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ప్రకారం 90 శాతం మంది అసంఘటిత ఎకానమీలో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story