నాన్న ఆరోగ్యం బాలేదు.. ఆయన కోసం ప్రార్థించండి: రాజశేఖర్ కుమార్తె శివాత్మిక

నాన్న ఆరోగ్యం బాలేదు.. ఆయన కోసం ప్రార్థించండి: రాజశేఖర్ కుమార్తె శివాత్మిక
ఇదే విషయమై కుమార్తె శివాత్మిక ట్వీట్ చేశారు.

హీరో రాజశేఖర్ కుటుంబం కొద్ది రోజుల క్రింతం కరోనా బారిన పడ్డారు. అయితే కుమార్తెలు ఇద్దరూ శివానీ, శివాత్మిక కోలుకోగా.. రాజశేఖర్, జీవిత హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం జీవితకు నెగిటివ్ రాగా.. రాజశేఖర్ మాత్రం ఇంకా కోలుకోలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందని సమాచారం.

ఇదే విషయమై కుమార్తె శివాత్మిక ట్వీట్ చేశారు. నాన్న కరోనాతో పోరాటం చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.. మీ అందరి అభిమానంతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను.. మీరు ఆయన కోసం ప్రార్థన చేయండి అంటూ శివాత్మిక అభిమానులకు విజ్ఞప్తి చేసింది. కాగా, రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై సినీ పరిశ్రమ ఆందోళన చెందుతోంది.

Tags

Read MoreRead Less
Next Story