కలెక్టర్ గారు.. కారు టైర్ మారుస్తున్నారు..

కలెక్టర్ గారు.. కారు టైర్ మారుస్తున్నారు..
మేడమ్! మీరు డిప్యూటీ కమిషనర్ (డిసి) కదూ.. మీరెందుకు టైర్ మారుస్తున్నారు.. ఒక్క ఫోన్ కొడితే మేం వచ్చి చేస్తాం కదా.. అని దారిన పోయే వ్యక్తి ఆమెను ఆశ్చర్యంగా అడిగారు.

మేడమ్! మీరు డిప్యూటీ కమిషనర్ (డిసి) కదూ.. మీరెందుకు టైర్ మారుస్తున్నారు.. ఒక్క ఫోన్ కొడితే మేం వచ్చి చేస్తాం కదా.. అని దారిన పోయే వ్యక్తి ఆమెను ఆశ్చర్యంగా అడిగారు. కర్ణాటక కలెక్టర్ రోహిణి సింధు హాయిగా నవ్వేసి.. నాకు ఊరి సమస్యలతో పాటు కారు సమస్యని కూడా పరిష్కరించడం తెలుసు. నాకు వచ్చినప్పుడు ఇంకెందుకు సహాయం కోరడం అని నేనే మార్చుతున్నాను అని సున్నితంగా సమాధానం చెప్పారు.

అవకాశం వస్తే చాలు హోదాని సాకుగా చూపే అధికారులు ఉన్న దేశంలో ఓ సాధారణ వ్యక్తిలా తన పని తాను చేసుకుంటున్న రోహిణి సింధూరి ఎంతోమంది అధికారులకు ఆదర్శం.

మైసూరు డిప్యూటీ కమిషనర్ (డిసి) రోహిణి సింధూరి పంక్చర్ పడిన ఎస్‌యూవీ టైర్‌ను మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. స్పేనర్‌తో జాక్ నడుపుతున్న వీడియో ఈ ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించబడిందో తెలియదు. కానీ ఇది మాల్ యొక్క పార్కింగ్ స్థలంగా కనిపిస్తుంది.

చుడిదార్ ధరించిన డిసి శనివారం సెలవుదినం కావడంతో బయటకు వెళ్లారు. తెల్లటి స్కార్పియో ఎస్‌యూవీని ఎత్తడానికి ఆమె జాక్ ఆపరేటింగ్‌లో బిజీగా ఉండగా, ఒక వ్యక్తి వచ్చి అడిగాడు 'మేడమ్, మీరు డీసీ రోహిణి సింధూరీనేనా అని'

ఆమె వెంటనే స్పందించకపోవడంతో 'మేడమ్' అని పదేపదే పిలిచిన తరువాత, మీరు పంక్చర్ వేస్తున్నారా? అని అడిగేసరికి అతడివైపు తిరిగి మాస్క్ ధరించి ఉన్నముఖంతో నవ్వింది.

ప్రభుత్వ సెలవు దినాలలో అధికారిక డ్రైవర్ నడుపుతున్న ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించడం దాదాపు అందరు ఐఎఎస్ అధికారులు చేసే పని. కానీ రోహిణి తన సొంత వాహనంలో బయటకు వెళ్లారు. అక్కడ టైరు పంక్చర్ అవడంతో తానే స్వయంగా మార్చుకున్నారు. కమిషనర్ హోదాలో ఉన్నప్పుడు టైర్ పాడైతే మరో వాహనం వారి కోసం సిద్ధంగా ఉంటుంది.

సమస్య పరిష్కారం అయిన తర్వాత దానిని తిరిగి తీసుకురమ్మని డ్రైవర్‌‌కు చెబుతారు. కానీ రోహిణి సింధూరి విషయంలో, ఆమె ఎవరి సహాయం తీసుకోకుండా కారు టైరును తానే మార్చుకున్నారు.

టైర్‌ను మార్చడం అంత సులభం కాదని వాహనదారులకు తెలుసు. జాక్‌తో వాహనాన్ని ఎత్తడం, చక్రాలను తొలగించి, కొత్త టైర్‌ను మార్చడం చాలా శ్రమతో కూడిన పని. నమ్మినా నమ్మకపోయినా! ఇది మా డిసి రోహిణి సింధూరి చేసారు! అని కర్ణాటక వాసులు వ్యాఖ్యానిస్తున్నారు.

రోహిణి టైరు మార్చిన దృశ్యాలను చూసి నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. గ్రేట్ మేడమ్.. మీరు మాకు స్ఫూర్తి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story