Narendra Modi: నరేంద్ర మోదీ వరల్డ్ ఫేమస్.. ప్రపంచంలోని ప్రధానుల్లో ఫస్ట్ ప్లేస్..

Narendra Modi (tv5news.in)

Narendra Modi (tv5news.in)

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన ఛరిష్మాను చాటుకున్నారు.

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన ఛరిష్మాను చాటుకున్నారు. ప్రపంచంలో అత్యంత ఆమోదయోగ్యమైన నేతగా మరోసారి నెంబర్ వన్ గా నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా 13 మంది ప్రపంచనేతల్లో మోదీనే అగ్రస్థానంలో నిలిచారు. ఈ రేటింగ్ సర్వేను మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సంస్థ నిర్వహించింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీమరోసారి తన మానియా చూపించారు. 2014లో భారత ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏటా తన పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో... ప్రధాని మోదీ టాప్ పొజిషన్‌లో నిలిచారు. సంపన్నదేశాల అధ్యక్షులు సైతం ప్రధాని మోదీ దరిదాపుల్లో లేరని సర్వేలో తేలింది....VIS

ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడికి ఎంత ఆదరణ ఉందో తెలుసుకునేందుకు.మార్నింగ్ కన్సల్ట్ సర్వే నిర్వహిస్తుంది. గతేడాది కూడా ప్రధాని మోదీనే మొదటి స్థానంలో నిలిచారు. ఈసారి సర్వే కోసం భారత్‌లో 2వేల 126 మందిని మార్నింగ్ కన్సల్ట్​సంస్థ ఆన్​లైన్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఏడాది మోదీ 70 శాతం ఓట్లతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ తెలిపింది...VIS

మరోవైపు మెక్సికో అధ్యక్షుడు లోపెజ్​ ఒబ్రేడర్ 66 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉండగా...ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ 58 శాతం ఓట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానానికి పరిమితమయ్యారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​ టాప్​ 10లో చివరిస్థానంలో నిలిచినట్లు సర్వే సంస్థ స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story