Narendra Modi: మోడీ చేతుల మీదుగా కొత్త స్కీమ్ ప్రారంభం.. రూ. 64,180 కోట్ల ఖర్చుతో..

Narendra Modi (tv5news.in)

Narendra Modi (tv5news.in)

Narendra Modi: ప్రధానమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుండి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం ఎన్నో స్కీమ్‌లను ప్రవేశపెట్టారు.

Narendra Modi: ప్రధానమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుండి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం ఎన్నో కొత్త స్కీమ్‌లను ప్రవేశపెట్టారు. తాజాగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 'ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన' అనే మరో కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టనున్నారు. కోవిడ్ సమయంలో సరిపడా ఆసుపత్రులు లేక.. సరిపడా వైద్య సదుపాయం లేక దేశ ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో చూసిన తర్వాత మోడీ ఈ నిర్ణయానికి వచ్చారు. రూ. 64,180 కోట్ల విలువ చేసే ఈ స్కీమ్‌ను నేడు ప్రారంభించనున్నారు నరేంద్ర మోడీ.

ఈరోజు మధ్యాహ్నం మోడీ తన పార్లమెంట్ నియోజకవర్గం అయిన వారణాసికి చేరుకుంటారు. అక్కడ నుండి వైద్య సదుపాయాలు మెరుగుపరచడం కోసం ప్రవేశపెడుతున్న ఈ స్కీమ్‌ను ప్రారంభించనున్నారు. నేషనల్ హెల్త్ మిషన్‌లో ఈ స్కీమ్ కూడా ఒక భాగం కానుంది. ఇది మాత్రమే కాదు.. త్వరలోనే వారణాసిని అభివృద్ధి చేయడానికి మరో రూ. 5,200 కోట్లను కూడా మోడీ మంజూరు చేయనున్నట్టు సమాచారం.

ప్రస్తుతం లాంచ్ చేయనున్న 'ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన' హెల్త్ స్కీమ్ ద్వారా ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇంకా ఏ మహమ్మారి వచ్చినా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ లెవెల్‌లో సదుపాయాలను పెంచనున్నారు. ఎక్కువ జనాభా ఉన్న 10 రాష్ట్రాల్లోని గ్రామాల్లో 17, 788 హెల్త్ కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నారు. వాటితో పాటు సిటీలలో కూడా కనీసం 11,024 హెల్త్ కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

అయిదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న జిల్లాల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉండేలా చూసుకోనున్నారు. ఈ స్కీ్మ్‌ను లాంచ్ చేయడంతో పాటు మోడీ.. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్‌లో కొత్తగా ఏర్పాటయిన తొమ్మిది మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story