దేశంలో కరోనా ఉధృతి వేళ కేంద్రం శుభవార్త

దేశంలో కరోనా ఉధృతి వేళ కేంద్రం శుభవార్త
డిచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు సంభవించలేదని తెలిపింది.

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ కేంద్రం ఓ శుభవార్త అందించింది. గడిచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు సంభవించలేదని తెలిపింది. అయితే ఇదే సమయంలో కొత్తగా 12 వేల 286 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 11లక్షల 24వేల 527కు చేరుకుంది.

మరోవైపు ఐదు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌లో రోజువారి కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 91 కరోనా మరణాలు సంభవించగా మహారాష్ట్రలో 30, పంజాబ్ లో 18, కేరళలో 13 తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. ఇక కరోనా రికవరీ రేటు 97.07శాతంగా ఉండగా.. పాజిటివిటీ రేటు 1.51 శాతంగా ఉంది.

ఇటు రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ దశలో 60 ఏళ్లు పైబడిన వారి, 45 ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారికి టీకా ఇవ్వనున్నారు. కేంద్రం లెక్కల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 1.48 కోట్ల మంది టీకా వేసుకున్నారు. ఇందులో 45-59 సంవత్సరాల వయస్సు గలవారికి, 60 ఏళ్లు పైబడిన వారికి 2.08 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story