Madurai: వ్యాక్సిన్ వేయించుకోపోతే అందులోకి నో ఎంట్రీ..

Madurai: వ్యాక్సిన్ వేయించుకోపోతే అందులోకి నో ఎంట్రీ..
Madurai: తమిళనాడులో వెలుచూసిన ఒమిక్రాన్ కేసు నేపథ్యంలో మధురై నగరం పౌరులకు కొన్ని ఆంక్షలు విధించింది.

Madurai: కరోనా కొత్త వేరియంట్ కలవర పెడుతోంది.. మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటివన్నీ మామూలే అయినా కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పదే పదే హెచ్చరించాయి. అయినా కొందరికి వ్యాక్సిన్ అంటే భయం.. మరికొందరికి అశ్రద్ధ. ఈ క్రమంలో ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూడడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

ఇప్పటికే తమిళనాడులో వెలుచూసిన ఒమిక్రాన్ కేసు నేపథ్యంలో మధురై నగరం పౌరులకు కొన్ని ఆంక్షలు విధించింది. టీకా తీసుకోని వారికి బహిరంగ ప్రదేశాలకు అనుమతి లేదని ఉత్తర్వులు జారీచేసింది. మాల్స్, మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్సులతో సహా 18 ప్రదేశాలకు అనుమతి నిరాకరించింది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చేలోపు ప్రజలు కనీసం ఒక్కడోసు టీకా అయినా వేయించుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది. కాగా, కర్ణాటకలో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన తరుణంలో ఈ తరహా ఆంక్షలే విధించింది. రెండు డోసుల టీకాను ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

Tags

Read MoreRead Less
Next Story