స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ ఒడిశా డిమాండ్!

స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ ఒడిశా డిమాండ్!

స్పెషల్ స్టేటస్ డిమాండ్‌ పెరిగిపోతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమకు ప్రత్యేక హోదా ఇవ్వా లని కోరుతుండగా, తాజాగా ఒడిశా కూడా ఆ జాబితాలో చేరింది. తమకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే తమ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.

వరుసగా ఐదోసారి ఒడిశా సీఎంగా ఎన్నికైన నవీన్ పట్నాయక్, ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత మోదీని, నవీన్ పట్నాయక్‌ కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఇద్దరు నేతల మధ్య 20 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ఫణి తుపాను కారణంగా రాష్ట్రంలో తీవ్ర నష్టం సంభవించిందని ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్, మోదీకి తెలిపారు. రాష్ట్రానికి 5 వేల కోట్ల సాయం అందించాలని కోరారు. నిరాశ్రయులైన వారికి 5 లక్షల పక్కా ఇళ్లు నిర్మించడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన మోదీ, ఫణి తుపాను ప్రభావం నుంచి రాష్ట్రాన్ని పునరుద్ధరించడానికి నవీన్ పట్నాయక్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రానికి వీలైనంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story