Omicron cases : భారత్‌‌లో 781కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు...!

Omicron cases : భారత్‌‌లో 781కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు...!
Omicron cases : ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్ భారత్‌లోనూ ప్రతాపం చూపిస్తోంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది.

Omicron cases : ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్ భారత్‌లోనూ ప్రతాపం చూపిస్తోంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 781 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆందులో 241 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఢిల్లీలో అత్యధికంగా 238 కేసులు, 167 కేసులతో మహారాష్ట్ర ఉన్నాయి. అటు కేరళలో 57, తెలంగాణలో 63 వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 9,195 తాజా కరోనా కేసులు నమోదయ్యాయి, ఇది నిన్నటితో పోలిస్తే 44 శాతం కంటే ఎక్కువ. విజృంభిస్తున్న కేసులతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కొత్త వేరింయట్‌ విసిరిన సవాళ్లతో.. జిల్లాల స్థాయిలో జనవరి 31వరకు కంటెయిన్ మెంట్ మెజర్స్ అమలు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది.144 సెక్షన్ విధించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రభుత్వం నిరంతరం వేగవంతం చేస్తోంది. గత 24 గంటల్లో కనీసం 7,347 మంది కోలుకున్నారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 3,42,51,292కి చేరుకుంది.

Tags

Read MoreRead Less
Next Story