onions: మార్కెట్లో కేజీ ఉల్లి.. చుక్కలు చూపిస్తున్న ధరలు..

onions: మార్కెట్లో కేజీ ఉల్లి.. చుక్కలు చూపిస్తున్న ధరలు..
onions: భారీ వర్షాల కారణంగా నాసిక్, పూణే, అహ్మద్‌నగర్ మరికొన్ని ఇతర జిల్లాలలో ఉల్లి పంటను తీవ్రంగా దెబ్బతీశాయి.

onions: భారీ వర్షాల కారణంగా నాసిక్, పూణే, అహ్మద్‌నగర్ మరికొన్ని ఇతర జిల్లాలలో ఉల్లి పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. ఉల్లి పంటను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి, ఫలితంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

కర్ణాటకలో కూడా అదే పరిస్థితి కనపడుతోంది. నాణ్యత దెబ్బ తిన్న ఉల్లి దిగుమతి వలన రాష్ట్రంలో డిమాండ్, సరఫరాలపై ప్రభావితం చూపుతోంది. రుతుపవనాల ఉపసంహరణ తర్వాత ఉల్లిపాయల రాక నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, రైతులు మరియు వ్యాపారులు కొత్త పంట వచ్చే వరకు ధరల అస్థిరత కొనసాగుతుందని సూచిస్తున్నారు.

నాణ్యతను బట్టి నాసిక్, ఇతర జిల్లాల్లో ఉల్లిని క్వింటాల్‌కు రూ. 2,500 నుండి రూ. 3,500 మధ్య వేలం వేస్తారు. అయితే, రిటైల్ మార్కెట్లో, ఉల్లిపాయను కిలో రూ .50 నుండి 60 వరకు విక్రయిస్తారు.

మార్కెట్‌లోకి ఉల్లి సరైన సమయానికి రాక పోతే ధరలు మరింత పెరగవచ్చు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో తిరిగి రుతుపవనాలు బీభత్సం సృష్టించిన కారణంగా పరిస్థితి భయంకరంగా ఉంది.

"కుండపోత వర్షాలతో పొలాల్లో నీరు నిలిచిపోవడం వల్ల ఉల్లి పంట దెబ్బతింది. అయితే, పొలాల్లో నీరు తగ్గిన తర్వాత ఉల్లిపాయల దిగుమతులు, ఎగుమతులు మళ్లీ మొదలయ్యాయి. నవంబర్ చివరి నాటికి కొత్త పంట వచ్చి ధరల్లో మార్పు వస్తుందని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

డిసెంబర్‌లో మళ్లీ ఉల్లి కొరత తీవ్రంగా ఉంటుందని నాసిక్‌కు చెందిన ప్రముఖ ఉల్లి వ్యాపారి నితిన్ జైన్ జాతీయ మీడియాతో అన్నారు. ఇప్పటికీ, మహారాష్ట్ర పాత ఉల్లిపాయకు దేశవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉంది.

"నాసిక్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా కొత్త ఉల్లి పంట దెబ్బతింది. అధిక డిమాండ్ మరియు తక్కువ సరఫరా కారణంగా, ధరలు పెరుగుతాయి, "అని ఆయన పేర్కొన్నారు.

కాగా, ఢిల్లీలో ఉల్లిపాయల రిటైల్ ధర అక్టోబర్ 14 నాటికి రూ. 44 కేజీలుగా ఉంది. అదేవిధంగా, ముంబై, కోల్‌కతా మరియు చెన్నైలలో వరుసగా రూ .45 కేజీలు, రూ .57 కిలోలు మరియు రూ .42 కేజీలు ఉన్నాయి. అక్టోబరు 14 వరకు ఆలిండియా రిటైల్ ధర కిలోకు రూ. 37.06 కాగా, ఆల్ ఇండియా హోల్ సేల్ ఉల్లిపాయ క్వింటాల్‌కు రూ. 3002.25.

Tags

Read MoreRead Less
Next Story