కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో కాంగ్రెస్

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో కాంగ్రెస్
Parliament Monsoon Session: సభలో కీలక బిల్లులను ఆమోదింపజేసుకుంటున్న కేంద్రం

Parliament Monsoon Session: పార్లమెంట్ సమావేశాలు నాలుగోవారంలోకి ప్రవేశించాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగలేదు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై విపక్ష పార్టీల నేతలు మరోసారి సమావేశం అయ్యారు. రైతు వ్యతిరేక చట్టాలు, పెగాసెస్‌ నిఘాపై చర్చకే పట్టుబట్టాలని నిర్ణయించారు. అవసరమైతే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.

మరోవైపు ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా కీలక బిల్లులను సభలో ప్రవేశపెడుతూ బిల్లులను ఆమోదింపజేసుకుంటోంది కేంద్రం. కీలకమైన ఓబీసీ బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టబోతోంది. బీసీలను గుర్తించడం, వారిని ఓబీసీ జాబితాలోకి చేర్చే అధికారం తిరిగి రాష్ట్రాలకే అప్పగించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ఓబీసీ బిల్లును ప్రవేశపెట్టడం.. కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టినట్టే అవుతుందని అధికార పార్టీ భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story