ఆ 33 లక్షల మంది రైతులకి కేంద్రం షాక్.. ఇక వారికి రూ.6 వేలు రానట్టే.. అందులో మీరున్నారా?

ఆ 33 లక్షల మంది రైతులకి కేంద్రం షాక్.. ఇక వారికి రూ.6 వేలు రానట్టే.. అందులో మీరున్నారా?
రైతులకి సహాయం చేసేందుకు మోడీ ప్రభుత్వం "ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి" అనే పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.. దాదాపు 3 సంవత్సరాల క్రితం ప్రధాని మోడీ స్వయంగా ప్రారంభించిన పథకం వల్ల చాలా మంది రైతులకి ప్రయోజనం కలుగుతుంది.

రైతులకి సహాయం చేసేందుకు మోడీ ప్రభుత్వం "ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి" అనే పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.. దాదాపు 3 సంవత్సరాల క్రితం ప్రధాని మోడీ స్వయంగా ప్రారంభించిన పథకం వల్ల చాలా మంది రైతులకి ప్రయోజనం కలుగుతుంది. అయితే ఈ పధకం కింద అర్హత కలిగిన ప్రతి రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తుంది కేంద్రం..

ఈ డబ్బులను మొత్తం మూడు విడతల్లో అంటే రూ.2 వేలు చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతోంది. అయితే కొంత మంది రైతులు అర్హత లేకున్నప్పటికి పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అలా మొత్తంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి 33 లక్షల మంది అనర్హులుగా తేల్చింది. ఇక వీరికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పధకం కింద వస్తున్న రూ.6,000 ఇక రావు.

అయితే అందులో మీరున్నారా లేదో క్షణాల్లోనే తెలుసుకోవచ్చు.. దీని కోసం మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి.. అక్కడ ఫార్మర్స్ కార్నర్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.. ఆ తర్వాత బెనిఫీషియరీ లిస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాల సాయంతో మీరు లిస్ట్ పొందొచ్చు.

ఒకవేళ ఇందులో మీ పేరు ఉంటే మీకు డబ్బులు వస్తాయి. లేకపోతే మాత్రం డబ్బులు రావు. ఇంకా ఈ స్కీమ్ లో ఎవరైనా చేరని వారు ఉంటే వారు కూడా పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా చేరొచ్చు. దీనికి కేవలం ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, పొలం పాస్ బుక్ ఉంటే సరిపోతుంది.

Tags

Read MoreRead Less
Next Story