కరోనాపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష ..!

కరోనాపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష ..!
కరోనాపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.

కరోనాపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి.. కేబినెట్ సెక్రెట‌రీతో స‌హా ప‌లువురు సీనియ‌ర్ అధికారులు, ప్రధాని ముఖ్య కార్యదర్శి‌, ఆరోగ్యశాఖ కార్యద‌ర్శి డాక్టర్ వినోద్ పాల్‌ హాజరయ్యారు. ప్రస్తుతం దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభణ‌, వాక్సినేష‌న్ ప్రక్రియ కొన‌సాగుతున్న తీరుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తున్నట్లు సమాచారం.

అటు దేశంలో కరోనా సెకండ్ వేవ్ స్వైర విహారం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 93వేల 249 కేసులు నమోదుకాగా.. 513 మంది మృత్యువాతపడ్డారు. మరణాలు కూడా గతంలో కంటే ఎక్కువగా పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య కోటి 24లక్షల 85వేల 509కు చేరగా.. మరణాల సంఖ్య లక్షా 64వేల 623కు చేరుకుంది. ఇక కోటి 16లక్షల 29వేల 289 మంది డిశ్చార్జి అవ్వగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 6లక్షల 91వేల 623 ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story