కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంపై సందిగ్ధతను అధిగమించాలి : ప్రధాని మోదీ

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంపై సందిగ్ధతను అధిగమించాలి : ప్రధాని మోదీ
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంపై సందిగ్ధతను అధిగమించాలన్నారు ప్రధాని మోదీ. వాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంపై సందిగ్ధతను అధిగమించాలన్నారు ప్రధాని మోదీ. వాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఒక రోజులో 86 లక్షలు కన్నా ఎక్కువ మందికి టీకాలు వేసి భారత దేశం చరిత్ర సృష్టించిందన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. కరోనా వైరస్‌పై దేశ ప్రజల పోరాటం కొనసాగుతోందని... ఈ పోరాటంలో మనమంతా ఓ అసాధారణ విజయాన్ని సాధించామన్నారు. జూన్ 21న 86 లక్షల మందికి పైగా ఉచిత వ్యాక్సిన్ తీసుకున్నారని, ఒక రోజులో ఇంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడం గొప్ప రికార్డన్నారు.

మధ్య ప్రదేశ్‌లోని బేటుల్ జిల్లా, దులేరియా గ్రామస్థులతో మోదీ మాట్లాడారు. వ్యాక్సిన్‌పై సందిగ్ధతను తమ గ్రామంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారని గ్రామస్థులు మోదీకి తెలిపారు. దీనిపై స్పందించిన మోదీ మాట్లాడుతూ, వదంతులను నమ్మవద్దని వారికి నచ్చజెప్పారు. తాను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నానని తెలిపారు. తన తల్లి వయసు సుమారు వందేళ్ళు ఉంటుందని, ఆమె కూడా రెండు డోసులను తీసుకున్నారని తెలిపారు. వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.

వదంతులను ప్రచారం చేసేవారిని చెయ్యనివ్వండని చెప్తూ, మనమంతా కలిసికట్టుగా ఉంటూ, మన పని మనం చేద్దామన్నారు. మన చుట్టూ ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకునేలా కృషి చేద్దామన్నారు. నూటికి నూరు శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్న గ్రామాలు మన దేశంలో చాలా ఉన్నట్లు తెలిపారు. కరోనా ముప్పు ఇంకా పొంచి ఉందన్న మోదీ... . ప్రజలు వ్యాక్సినేషన్‌పైనా, కరోనా వైరస్ నిరోధక మార్గదర్శకాలను పాటించడంపైనా దృష్టి సారించాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story