కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గడంతోనే ఢిల్లీలో పొలిటికల్ హీట్..!

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గడంతోనే ఢిల్లీలో పొలిటికల్ హీట్..!
కోవిడ్‌ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని సానుకూలంగా మలుచుకునే అవకాశాలు చూస్తున్నాయి విపక్షాలు.

కరోనా సెకెండ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో ఢిల్లీలో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. కోవిడ్‌ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని సానుకూలంగా మలుచుకునే అవకాశాలు చూస్తున్నాయి విపక్షాలు. కాంగ్రెస్‌తో జట్టు కడితే ప్రయోజనం లేదనే ఆలోచనలో ఉన్న పార్టీలు.. ప్రత్యామ్నాయ కూటమికి కసరత్తులు చేస్తున్నాయి.

ప్రాంతీయ పార్టీల కూటమి గానే.. బీజేపీని ఎదుర్కోవాలనే నిర్ణయానికి రాజకీయ వ్యూహకర్తలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌. తృణముల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిష్టులు, ఇతర ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటుకు కసరత్తులు ప్రారంభించారు. ఈ సాయంత్రం ఢిల్లీలోని శరద్‌ పవార్‌ నివాసంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశానికి..ప్రశాంత్‌ కిషోర్‌తో పాటు విపక్షనేలంతా హాజరవుతున్నారు. ఫరూక్‌ అబ్దుల్లా, యశ్వంత్‌సిన్హా, పవన్‌ వర్మ, సంజయ్‌ సింగ్‌, డీ రాజా, జస్టీస్‌ ఏపీ సింగ్, జావేద్‌ అక్తర్‌, తులసీ, కరణ్‌తాఫర్‌, తదితరులు హాజరు కానున్నారు. కాంగ్రెస్‌ ప్రతినిధులు హాజరవుతున్నారా లేదా అన్న అంశంపై సందిగ్దత కొనసాగుతోంది. మరోవైపు థర్డ్‌ ప్రంట్‌ ఏర్పాటు దిశగా ఈ సమావేశం జరగడం లేదంటున్నారు ప్రశాంత్‌ కిషోర్‌. రాహుల్‌ గాంధీ ప్రధాని అభ్యర్ధిగా ముందుకు వస్తే అభ్యంతరం లేదంటున్నారాయన.

Tags

Read MoreRead Less
Next Story