ఈనెల 30 వ తేదీ వరకు లాక్‌డౌన్‌తో పాటు నైట్ కర్ఫ్యూ..

ఈనెల 30 వ తేదీ వరకు లాక్‌డౌన్‌తో పాటు నైట్ కర్ఫ్యూ..
రోజు రోజుకి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వీటిని కట్టడి చేయాలంటే లాక్డౌన్‌ తప్పేలా లేదు. కేసులు ఎక్కువవుతున్నాయని తెలిసినా ప్రజలు రోడ్ల మీద విచ్చలవిడిగా సంచరిస్తున్నారు.

రోజు రోజుకి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వీటిని కట్టడి చేయాలంటే లాక్డౌన్‌ తప్పేలా లేదు. కేసులు ఎక్కువవుతున్నాయని తెలిసినా ప్రజలు రోడ్ల మీద విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఇక వారాంతాల్లో అయితే ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని భావించి దీన్ని కట్టడి చేయాలనుకుంది పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ). ఇందులో భాగంగానే పూర్తిస్థాయిలో వీకెండ్ లాక్‌డౌన్ ప్రకటించింది.

ఈనెల 30 వ తేదీ వరకు లాక్‌డౌన్‌తో పాటు నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఎమెర్జెన్సీ సర్వీసులు మినహా మిగతా వాటన్నింటిని మూసివేయనున్నట్లు తెలిపింది. వారాంతపు లాక్‌డౌన్‌లో భాగంగా శుక్రవారం సాయింత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు దుకాణాలు, మార్కెట్లు మూతపడనున్నాయి. ఇప్పటికే పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లను మూసివేశారు. అయితే సహకార, ప్రభుత్వ, ప్రవేటు రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, టెలికాం, ఐటీ సంస్థలు, న్యాయవాదులు, సీఏలతో పాటు ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు తెరిచే ఉంటాయి.

పుణె జిల్లాలో గురువారం కొత్తగా 12 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,16,127కు చేరగా.. ఇప్పటి వరకు 10,472 మంది మృత్యువాత పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story