ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామి..!

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామి..!
ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామి పేరు ఖరారు అయింది. ఈ మేరకు శనివారం జరిగిన సమావేశంలో భాజపా శాసనసభాపక్ష నేతగా పుష్కర్‌ను ఎన్నుకున్నారు

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామి పేరు ఖరారు అయింది. ఈ మేరకు శనివారం జరిగిన సమావేశంలో భాజపా శాసనసభాపక్ష నేతగా పుష్కర్‌ను ఎన్నుకున్నారు. దీనితో ఆ రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా త్వరలోనే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం పుష్కర్‌ సింగ్‌ ధామి ఉదమ్‌సింగ్‌ నగర్‌ జిల్లాలోని ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా అనేక రాజకీయ పరిణామాల నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తీరథ్‌ సింగ్‌ రావత్‌ శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story