కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం..!

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం..!
ఆక్సిజన్ కొరతతో ఆస్పత్రులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ కొరతతో ఆస్పత్రులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఖాళీ ట్యాంకర్లు ముంబయి సమీపంలోని కలంబోలి, బోయర్స్ రైల్వే స్టేషన్ల నుంచి బయల్దేరి వైజాగ్‌, జంషెడ్‌పుర్‌, రవుర్కెలా, బొకారోల నుంచి ప్రాణవాయువును నింపుకుని తీసుకువస్తాయి. ఇందుకోసం ప్రత్యేక గ్రీన్ కారిడార్ ట్రాక్ ఏర్పాటు చేసింది. ఆక్సిజన్ సిలిండర్లను రైళ్ల ద్వారా తరలించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఇటీవలే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు రైల్వేశాఖకు లేఖరాశాయి. ఈ క్రమంలోనే ఆక్సీజన్‌ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ ప్రారంభించింది.

ఆక్సిజక్ కొరత నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా నిలిపివేసి.. వాటిని ఆస్పత్రులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. అయితే ఫార్మసూటికల్, పెట్రోలియం రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్స్, న్యూక్లియర్ ఎనర్జీ ఫెసిలిటీలు, ఆక్సీజన్ సిలిండర్ల మ్యానుఫ్యాక్చర్స్, వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, ఫుడ్ అండ్ వాటర్ పురిఫికేషన్‌ పరిశ్రమలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఇవి మినహా మిగతా పరిశ్రమలకు ఏప్రిల్ 22నుంచి ఆక్సిజన్ సరఫరా నిలిపివేయాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రహోంశాఖ అజయ్ భల్లా లేఖ రాశారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులతో ఆస్పత్రులు నిండిపోతున్న నేపథ్యంలో శ్వాస సంబంధ ఇబ్బందులతో ఉన్న రోగులకు ఆక్సిజన్ తప్పనిసరిగా ఇవ్వాలి. ప్రస్తుతం మనదేశంలో లక్షలాది కేసులు కేసులు నమోదవుతుండడంతో.. ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడింది. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక రోగులు మృతిచెందుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో సరిపడినంత ఆక్సిజన్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది.

Tags

Read MoreRead Less
Next Story