Rajasthan Road Accident: పరీక్షకు వెళుతూ.. పై లోకాలకు.. : రోడ్డు ప్రమాదంలో 6గురు విద్యార్దులు

Rajasthan Road Accident: పరీక్షకు వెళుతూ.. పై లోకాలకు.. : రోడ్డు ప్రమాదంలో 6గురు విద్యార్దులు
రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించే రీట్ (REET) అర్హత పరీక్ష కోసం హాజరుకాబోతున్నట్లు సమాచారం.

Rajasthan Road Accident: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని చక్సులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్ధులు అక్కడికక్కడే మరణించారు. శనివారం తెల్లవారుజామున చక్సు పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమోడియా కట్ సమీపంలో హైవేపై జరిగిన భారీ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్‌తో సహా ఆరుగురు మరణించారు. మరో అయిదుగురు యువకులు గాయపడ్డారు. మరణించిన మరియు గాయపడిన వారంతా రాజస్థాన్‌కు చెందిన వారు. రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించే రీట్ (REET) అర్హత పరీక్ష కోసం హాజరుకాబోతున్నట్లు సమాచారం.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పుత్రులలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. యువకులందరూ బరన్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారుగా పేర్కొన్నారు. రీట్ పరీక్ష రాయడానికి యువకులందరూ వ్యాన్‌లో ప్రయాణమయ్యారు. చక్సు వద్దకు రాగానే వ్యాన్ అదుపు తప్పి ట్రైలర్‌లోకి దూసుకెళ్లింది.

పరీక్షకు వెళుతూ.. పై లోకాలకు.. : రోడ్డు ప్రమాదంలో 6గురు విద్యార్దులుఢీకొనడం చాలా తీవ్రంగా ఉండడంతో వ్యాన్ బాగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో సహా ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు. అయితే వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఇతర యువకులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ అయిదుగురు యువకులు MGH ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తెలియగానే మృతుల కుటుంబ సభ్యులు మరియు క్షతగాత్రులు ఆసుపత్రికి చేరుకోవడం ప్రారంభించారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story