రజనీకాంత్‌ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

రజనీకాంత్‌ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
బేగంపేట విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో రజనీకాంత్ని చెన్నైకి పంపేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

హై బీపీతో అస్వస్థతకు గురైన రజనీకాంత్‌ ఇవాళ డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలోలో 3 రోజులుగా ఆయనకు స్పెషలిస్టు వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది. రక్తపోటులో తేడా వల్ల అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఇప్పటికే వివిధ పరీక్షలు చేశారు. ఆ రిపోర్టులన్నీ నార్మల్ రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. డిశ్చార్జ్ చేసే విషయంపై ఇవాళ సాయంత్రానికి మరికొన్ని రిపోర్టులు వచ్చాక వాటిని బట్టి నిర్ణయం తీసుకుంటారు.

బీపీ సాధరణ స్థాయికి రావడంతో ఇవాళే రజనీకాంత్‌ను ఇంటికి పంపించే అవకాశాలున్నాయి. బేగంపేట విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో ఆయన్ను చెన్నైకి పంపేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అటు, అభిమానులు కూడా సూపర్ స్టార్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి రావాలని పూజలు చేస్తున్నారు. డిసెంబర్ 31న రాజకీయ పార్టీపై ప్రకటన నేపథ్యంలో డిశ్చార్జ్ కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story