రజనీకాంత్‌ పార్టీ ప్రారంభంపై ప్రచారంలో మూడు తేదీలు!

రజనీకాంత్‌ పార్టీ ప్రారంభంపై ప్రచారంలో మూడు తేదీలు!

Rajinikanth(File Photo)

రజనీకాంత్ పార్టీ పేరు, జెండా, గుర్తు అన్ని వివరాలు వచ్చేది డిసెంబర్‌ 31నే. మరి పార్టీ ప్రారంభించేది ఎప్పుడు? తమిళనాట దీనిపైనే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు

రజనీకాంత్ పార్టీ పేరు, జెండా, గుర్తు అన్ని వివరాలు వచ్చేది డిసెంబర్‌ 31నే. మరి పార్టీ ప్రారంభించేది ఎప్పుడు? తమిళనాట దీనిపైనే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. వచ్చే 31వ తేదీన తలైవా నుంచి సూపర్‌ స్టేట్‌మెంట్లు ఆశిస్తున్న ప్రజలు.. పనిలో పనిగా పార్టీని ప్రారంభించే తేదీ కూడా ప్రకటిస్తే బాగుండు అనుకుంటున్నారు. రజనీ నుంచి అధికారిక స్టేట్‌మెంట్‌ రాకపోయినప్పటికీ అభిమానులే కొన్ని డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నారు. సంక్రాంతికి పార్టీ ప్రారంభించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

నిజానికి రజనీకాంత్‌ అభిమాన సంఘం అధ్యక్షులే పార్టీ నేతలుగా ఉండబోతున్నారు. సో, అభిమానుల నుంచి ఓ న్యూస్‌ వచ్చిందంటే అందులో ఎంతోకొంత వాస్తవం ఉంటుందనే అర్ధం. ప్రస్తుతం వినిపిస్తున్న డేట్‌.. జనవరి 14. సంక్రాంతి రోజున పార్టీని ప్రారంభిస్తే ఆ సెంటిమెంట్‌ బాగా వర్క్‌ఔట్‌ అవుతుందనేది ఓ ప్రచారం. సాధారణంగా పొంగల్‌ ఫెస్టివల్‌కు సినిమాలు విడుదలవుతాయి. ఈసారి రజనీకాంత్ పార్టీ విడుదలవుతుందనేది ఓ టాక్. రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలకు, సంక్రాంతి నాడు పార్టీ ప్రారంభోత్సవానికి బాగా సెట్‌ అవుతుందంటున్నారు.

మరో తేదీ కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కనుమ పండుగ మరుసటి రోజే ఎంజీఆర్ జయంతి. తమిళుల ఆరాధ్య నటుడు, ఒకప్పటి సీఎం. సో, జనవరి 17న ఎంజీఆర్‌ జయంతిని పురస్కరించుకుని పార్టీ ప్రారంభిస్తే.. రాజకీయంగా కలిసొస్తుందన్న ఆలోచన కూడా చేస్తున్నారు. మరోవైపు జనవరి 21వ తేదీ కూడా ప్రచారంలో ఉంది. అయితే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాలని మక్కల్ మండ్రం నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే రజనీకాంత్ పార్టీ పేరు మక్కల్ సేవై కట్చి అంటూ ప్రచారం జరుగుతోంది. ఆటోను ఎన్నికల గుర్తుగా ఫిక్స్‌ చేశారనీ చెప్పుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతోనూ చేతులు కలపబోమని రజనీ చెప్పేశారు. అన్ని అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో డీఎంకే, అన్నాడీఎంకే నుంచి కొందరు నేతలు రజనీ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీరంగంలో అందరివాడు అనిపించుకున్న రజనీ.. రాజకీయ పార్టీలతోనూ మంచి సంబంధాలనే కొనసాగించారు. అటు స్టాలిన్ అన్నయ్య అళగిరితోనూ రజనీకి సత్సంబంధాలు ఉన్నాయి. సో, సొంతంగా పార్టీ పెట్టే బదులు.. రజనీ పార్టీలోనే చేరాలని అళగిరి భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరిలో పార్టీ ప్రారంభించిన తరువాత రజనీ పార్టీలోకి వలసలు భారీ ఎత్తున ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story