కరోనా తెచ్చిన కష్టం.. కూరగాయలు అమ్ముతున్న దర్శకుడు..

కరోనా తెచ్చిన కష్టం.. కూరగాయలు అమ్ముతున్న దర్శకుడు..
మహమ్మారికి ముందు అతను భోజ్‌పురి చిత్రంలో పని చేయాల్సి ఉంది, తరువాత హిందీ సినిమాకు పనిచేయాల్సి ఉంది.

మహమ్మారి కరోనా మనిషుల జీవితాలను మార్చేసింది. చాలా మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. తాజాగా ఓ టీవీ సీరియల్ డైరెక్టర్ రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటున్నాడు. బాలికా వదు.. తెలుగులో వచ్చిన చిన్నారి పెళ్లి కూతురు. ఈ సీరియల్ అటు దక్షిణాదిన, ఇటు ఉత్తరాదిన ఎంతో పేరు తెచ్చుకుంది. అందులో నటించిన నటీ నటులు సైతం సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకున్నారు. ఇక ఈ సీరియల్‌కు దర్శకత్వం వహించిన రామ్ వృక్ష గౌర్ తన స్వస్థలమైన ఉత్తర ప్రదేశ్‌లోని అజమ్‌గర్‌లో కూరగాయలను విక్రయిస్తున్నారు.

మీడియాతో మాట్లాడుతూ, తాను ఫిల్మ్ కోసం జిల్లాకు వచ్చానని పేర్కొన్నాడు. మహమ్మారికి ముందు అతను భోజ్‌పురి చిత్రంలో పని చేయాల్సి ఉంది, తరువాత హిందీ సినిమాకు పనిచేయాల్సి ఉంది. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ తరువాత, ఆయనకు ముంబైకి తిరిగి వెళ్లడం సాధ్యం కాలేదు. దాంతో మేము పనిచేస్తున్న ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. చిత్రం మళ్లీ మొదలు పెట్టాలంటే మరో సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని నిర్మాత చెప్పారు." దాంతో ఖాళీగా ఉంటే కష్టమని భావించిన అతడు తన తండ్రి వ్యాపారమైన కూరగాయల అమ్మకాన్ని తానూ చేయాలనుకున్నాడు. ఓ తోపుడు బండి తీసుకుని వాటి మీద కూరగాయలు పెట్టుకుని వీధులు తిరుగుతూ అమ్మకం సాగిస్తున్నారు. కూరగాయలు అమ్ముతున్నందుకు నాకేమీ విచారంగా లేదు. నాకు ముంబైలో సొంత ఇల్లు ఉంది. అక్కడ చేయలేని పని ఇక్కడ చేస్తున్నాను.

రచయిత షహనావాజ్ ఖాన్ సహాయంతో చిన్న తెరపై తన వృత్తిని ప్రారంభించడానికి ముంబై వెళ్ళాడు. "నేను మొదట లైట్ విభాగంలో పని చేశాను. తరువాత టీవీ సీరియల్స్ విభాగంలో పనిచేశాను. నేను మొదట చాలా సీరియల్స్ నిర్మాణంలో అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను, తరువాత సీరియల్ డైరెక్టర్‌గా బాలికా వదుకు పనిచేశాను. " అని చెప్పారు. రణదీప్ హూడా, సునీల్ శెట్టి, యశ్‌పాల్ శర్మ, రాజ్‌పాల్ యాదవ్ వంటి నటులు నటించిన పలు చిత్రాల్లో రామ్ వృక్ష గౌర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story