సాధరణ ఎన్నికలకు ముందే అయోధ్యలో రామ మందిరం పూర్తి..!

సాధరణ ఎన్నికలకు ముందే అయోధ్యలో రామ మందిరం పూర్తి..!
Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధారణ ఎన్నికల కంటే ముందే పూర్తి అవుతుందని తెలిపాయి ఆలయ ట్రస్ట్ వర్గాలు.

Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధారణ ఎన్నికల కంటే ముందే పూర్తి అవుతుందని తెలిపాయి ఆలయ ట్రస్ట్ వర్గాలు. డిసెంబర్​ 2023 నాటికి భక్తుల కోసం ఆలయ తలుపులు తెరుచుకుంటాయన్నారు ట్రస్ట్​ జనరల్​ సెక్రెటరీ చంపత్​ రాయ్. 2024 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తవుతుందన్నారాయన. 2023 డిసెంబర్​ నాటికి భక్తుల కోసం ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయన్నారు. ఆలయ శంకుస్థాపన మొదటి దశ పనులు సెప్టెంబర్​ పూర్తి కాగా.. రెండో దశ పనులు మాత్రం నవంబర్​ 15 నాటికి పూర్తి అవుతాయన్నారు.

ప్రస్తుతం కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఇవి రాత్రి సమయాల్లో మాత్రమే చేస్తున్నారు. ఆ సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందుకే అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్ 2023లోగా ఆలయ గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని సంకల్పించాం. అది పూర్తి అయితే భక్తుల దర్శనార్థం ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గతేడాది ప్రధాని నరేంద్రమోదీ.. ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు.

Tags

Read MoreRead Less
Next Story