తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం

దేశవ్యాప్తంగా రంజాన్‌ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయాన్నే మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి.. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గల్ఫ్‌ దేశాల్లో నిన్ననే పండగ జరుపుకున్నా.. మన దగ్గర నిన్న నెలవంక కనిపించడంతో ఇవాళే ఈద్‌-ఉల్‌-ఫితర్‌గా ఇమామ్‌లు ప్రకటించారు. దీంతో మంగళవారంతో ఉపవాస దీక్షలు ముగించారు. ఇవాళ సామూహికంగా జమాత్‌లు నిర్వహించారు.. ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు చోట్ల వేలాదిమంది ఈద్గాల వద్ద ప్రార్థనల్లో పాల్గొన్నారు.

నెల రోజులుగా ఇఫ్తార్ విందులు కూడా తెలుగు రాష్ట్రాల్లో పండగవాతావరణంలో జరిగాయి. ప్రభుత్వాలే కాదు.. కొందరు ముఖ్యులు కూడా ప్రత్యేకంగా విందు ఇచ్చారు. నిన్నటితో ఉపవాస దీక్షలు ముగియడంతో.. మసీదులు, ఈద్గాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముస్లింలు పరమ పవిత్రంగా భావించే ఖురాన్ ఈ పవిత్ర రంజాన్ మాసంలోనే ఆవిర్భవించిందని చెప్తారు. చెడును పూర్తిగా వదిలిపెట్టి సన్మార్గంవైపు నడవాలన్న ఉద్దేశంతోనే ఈ ఉపవాస దీక్షలు చేస్తారు. శక్తిమేరకు దానాలు చేస్తారు. ఇలా ఈ నెలంతా ముస్లింలకు ఎంతో ప్రత్యేకం. పండుగ ముగింపు సందర్భంగా.. నోరూరించే ప్రత్యేకమైన వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. ఆత్మీయులకు, మిత్రులకు ఖీర్ పంచుతూ శుభాకాంక్షలు చెప్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story