హీరోతో ప్రేమలో పడిన రష్మిక..!!

హీరోతో ప్రేమలో పడిన రష్మిక..!!
ఓ రెండు మూడు సినిమాల్లో కలిసి నటించినంత మాత్రాన.. ఆ హీరోతో ప్రేమలో ఉన్నానని అలా ఎలా డిసైడ్ అయిపోతారు.

అవును.. అందరూ అదే అంటున్నారు.. ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు.. ఓ రెండు మూడు సినిమాల్లో కలిసి నటించినంత మాత్రాన.. ఆ హీరోతో ప్రేమలో ఉన్నానని అలా ఎలా డిసైడ్ అయిపోతారు అని రష్మిక మందన వాపోతోంది. అవన్నీ కేవలం వదంతులు.. వారి ఊహాగానాలు మాత్రమే అని స్పష్టం చేసింది. నేను సింగిల్ గా, హ్యాపీగా ఉన్నాను.. జీవితంలో ఒంటరిగా ఉండడంలోని ఆనందం తెలుసుకుంటే.. మనకు కాబోయే జీవిత భాగస్వామిపై కూడ అంచనాలు పెరుగుతాయి అని రష్మిక పేర్కొంది. కాగా, సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప' చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం చిత్తూరు యాస నేర్చుకుంటోంది. కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న కోలీవుడ్ చిత్రం 'సుల్తాన్' లోనూ హీరోయిన్ గా కనిపించబోతోంది. కన్నడ సినిమా 'పొగరు'లోనూ నటిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story