ఆమెకు మాత్రమే ఇన్విటేషన్.. ఏంటో అంత స్పెషల్

ఆమెకు మాత్రమే ఇన్విటేషన్.. ఏంటో అంత స్పెషల్
ఇద్దరూ కలిసి రెండు చిత్రాల్లో నటించారు. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి గుసగుసలు వినిపించాయి.

ఇద్దరూ కలిసి రెండు చిత్రాల్లో నటించారు. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి గుసగుసలు వినిపించాయి. అయినా అలాంటివాటికి ఏ మాత్రం స్పందించకుండా తన పని తాను చేసుకుపోతుంటాడు 'రౌడీ' విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్ తన తల్లి మాధవి 50వ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు విజయ్ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వేడుకల్లో స్పెషల్‌గా కనిపించింది బ్యూటీ రష్మిక మందన. విజయ్ కుటుంబంతో కలిసి ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అనంతరం విజయ్ తల్లితో కలిసి దిగిన ఫోటోను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. రౌడీ పేరుతో విజయ్ ఓ బ్రాండెడ్ స్టోర్‌ని రన్ చేస్తున్నాడు.. బిజినెస్‌లో కూడా సక్సెస్ అయిన విజయ్ తన ప్రతి చిత్రానికి ఏ మాత్రం టెన్షన్ పడకుండా ఈజీగా నటించేస్తూ యూత్‌ని అట్రాక్ట్ చేస్తుంటాడు. కాగా, పూరీజగన్నాథ్ డైరక్షన్లో వస్తున్న 'ఫైటర్' చిత్రంలో విజయ్ హీరోగా నటిస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story