Ravana: రావణాసురుడి విమాన ప్రయాణం.. ఎంత వరకు నిజం..

Ravana: రావణాసురుడి విమాన ప్రయాణం.. ఎంత వరకు నిజం..
Ravana: అసురులు, దేవతలు కూడా అప్పట్లోనే టెక్నాలజీని ఉపయోగించారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.

Ravana: అసురులు, దేవతలు కూడా అప్పట్లోనే టెక్నాలజీని ఉపయోగించారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. పురాణేతిహాసాల్లో పుష్పక విమానాలు ఉంటాయని వింటాము.. కానీ పరిశోధకులు లంకాధీశుడైన రావణాసురుడు విమానాల్ని ఉపయోగించేవాడని చెబుతున్నారు. అయితే దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని వివరిస్తున్నారు.

ఈ విషయంపై స్పష్టత కోసం శ్రీలంక ప్రభుత్వం గతంలో ఒక పరిశోధక బృందాన్ని ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా పరిశోధన వాయిదా పడింది. తాజాగా ఈ పరిశోధనలపై అధికారులు దృష్టి సారించారు. ఈ కీలక పరిశోధనలో భారత ప్రభుత్వం కూడా పాల్గొనాలని శ్రీలంక పరిశోధన బృందం కోరుతోంది.

ప్రపంచంలోనే మొదటిసారి విమానాన్ని ఉపయోగించింది రావణుడు అని శ్రీలంక ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే ఇదంతా కేవలం కల్పితం అని కొట్టిపారేసే వాళ్లున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో నిజమెంతో తెలుసుకోవడం కోసం రెండేళ్ల క్రితం చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, పురావస్తు శాఖవారు సమావేశం ఏర్పాటు చేసారు. అప్పుడు జరిగిన చర్చోపచర్చల్లో రావణుడు విమానంలో శ్రీలంక నుంచి భారత్‌కు వచ్చాడని ఓ అభిప్రాయానికి వచ్చారు.

శ్రీలంక ప్రభుత్వం ఈ అంశంపై పరిశోధన కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయనుంది. రూ.5 మిలియన్ విడుదల చేసింది. కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో పరిశోధనలు తిరిగి ప్రారంభించేందుకు శ్రీలంక ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది పరిశోధనలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story