Salman Khurshid : కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి..!

Salman Khurshid :  కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి..!
Salman Khurshid : కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి జరిగింది. కొందరు ఆయన ఇంటిని ధ్వంసం చేశారు.

Salman Khurshid : కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి జరిగింది. కొందరు ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. కిటికీ అద్దాలు పగులగొట్టి, తలుపులకు నిప్పుపెట్టారు. సల్మాన్ ఖుర్షీద్ ఇటీవల తన పుస్తకం ''సన్ రైజ్ ఓవర్ అయోధ్య-నేషన్‌వుడ్ ఇన్ అవర్ టైమ్స్''లో హిందుత్వను ర్యాడికల్ ఇస్లాంతో పోల్చడం వివాదమైంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

దుండగులు తన ఇంటిపై దాడి జరిపిన ఫోటోలు, వీడియోలను సల్మాన్ ఖుర్షీద్ ఫేస్‌బుక్‌ లో పోస్ట్ చేశారు. ఇదేనా హిందుత్వమంటే అని ప్రశ్నించారు. సిగ్గు అనే పదం కూడా సిగ్గుపడేలా ఈ చర్య ఉందని అన్నారు. ఆయన పోస్ట్ చేసిన వీడియోల్లో ఒక వీడియోలో కొందరు బీజేపీ జెండా ఊపుతూ 'జై శ్రీరామ్' నినాదాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి ఘటనను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఓ ట్వీట్‌లో ఖండించారు. దేశం పట్ల తనకున్న విజన్‌ను గర్వించదగిన రీతిలో అంతర్జాతీయ వేదకలపై కూడా చాటిన రాజనీతిజ్ఞుడు సల్మాన్ ఖుర్షీద్ అని, ఆయన ఇంటిపై దాడి జరపడం అమర్యాదకరమని అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story