మొక్కలకు పాలు పోస్తే.. సమంత కొత్త టిప్

మొక్కలకు పాలు పోస్తే.. సమంత కొత్త టిప్
బాల్కనీ సాగుతో బిజీగా మారిపోయింది స్టార్ హీరోయిన్ సమంత..

టాలీవుడ్ బ్యూటీ సమంత మొక్కల సంరక్షణ, పెంపకానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులతో ఇన్‌స్టాలో పంచుకుంటున్నారు. తాజాగా ఓ కొత్త టిప్ చెబుతున్నారు. డేట్ దాటిపోయిన పాల పాకెట్ కానీ, పాల పౌడర్ కానీ పడేయకుండా ఎంచక్కా మొక్కలకు పోస్తే వాటికి కావలసిన పోషణ అందుతుందని వివరించారు. నేను ఇలాగే చేస్తున్నాను. మీరు కూడా చేసి చూడండి అని వివరిస్తున్నారు. ఎక్స్‌పైరీ డేట్‌ దాటిపోయిన పాలు, పాలపదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. కానీ ఆ పాలను పడేయకుండా మొక్కలకు పోస్తే మంచి ఎరువుగా పనికొస్తుందని అంటున్నారు. ఈ పాలలో యాంటీ ఫంగల్, యాంటీ పెస్టిసైడ్ గుణాలు ఉంటాయి. పాలలోని క్యాల్షియం మొక్కలు పెరిగేందుకు తోడ్పడుతుంది. టొమాటో, దోస, గుమ్మడి వంటి మొక్కల్లో పూత రాలడాన్ని అరికడుతుంది. పాలలోని ప్రొటీన్లు, విటమిన్ బి.. మొక్కలు ఆరోగ్యంగా ఎదగడానికి సాయపడుతుంది. త్వరగా ఎదగాలి.. బలంగా తయారవ్వాలని ఎక్కువ పాలు పోయకండి సుమీ అవి చచ్చిపోతాయి అని కూడా అంటున్నారు.

మొక్కలకు పాలు పోసే విధానాన్ని వివరిస్తూ.. ఏ పాలు అయినా వాటికి కొద్దిగా నీళ్లు కలిపి స్ప్రే బాటిల్ లో పోసి ఆకులపై చిలకరించాలి. ఓ అరగంట తరువాత ఆకులు ఆ నీటిని పూర్తిగా పీల్చుకున్నాయో లేదో గమనించి మిగిలిన నీటి చుక్కలను బట్టతో తుడవాలి. లేదంటే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని సమంత పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story