కరోనా నుంచి కోలుకున్నా.. ప్లాస్మా దానం చేశా: శేఖర్ మాస్టర్

కరోనా నుంచి కోలుకున్నా.. ప్లాస్మా దానం చేశా: శేఖర్ మాస్టర్
స్టార్ హీరోలకు ఆయన ఫేవరెట్ కొరియోగ్రాఫర్..

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్టెప్పేస్తే బొమ్మ బ్లాక్ బస్టరే.. ఆయన డ్యాన్స్ స్టెప్పులకు ఫిదా అవ్వని ప్రేక్షకులూ ఉండరు.. సినిమా స్టార్లూ ఉండరు.. స్టార్ హీరోలకు ఆయన ఫేవరెట్ కొరియోగ్రాఫర్ కూడా. వెండితెరమీద డ్యాన్స్ మాస్టర్ గా అదిరిపోయే స్టెప్పులు.. బుల్లి తెరమీద వినోదం పంచే పంచులు వేస్తూ రెండు చోట్లా ప్రేక్షకులను అలరిస్తూ బిజీగా ఉండే శేఖర్ మాస్టర్ కి నెల రోజుల క్రితమే కరోనా వచ్చిందని ఆయనే స్వయంగా వెల్లడించారు.. కిమ్స్ లో చికిత్స తీసుకుని కోలుకున్న అనంతరం ప్లాస్మాను దానం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది. కరోనా నుంచి రికవరీ అయిన వారంతా ప్లాస్మా దానం చేయమని శేఖర్ మాస్టర్ కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story