Sonu Sood : పొలిటికల్ ఎంట్రీ పై సోనూ సూద్ క్లారిటీ..!

Sonu Sood : పొలిటికల్ ఎంట్రీ పై సోనూ సూద్  క్లారిటీ..!
Sonu Sood : పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు సినీ నటుడు సోనూ సూద్.. మరో అయిదేళ్ళ పాటు సమాజసేవ పైన దృష్టి ఆ తరవాత రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.

Sonu Sood : పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు సినీ నటుడు సోనూ సూద్.. మరో అయిదేళ్ళ పాటు సమాజసేవ పైన దృష్టి పెట్టి ఆ తరవాత రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. ప్రస్తుతం తనవద్ద తగినంత పెద్ద టీమ్‌ లేదని అన్నారు.. త్వరలో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఈ మేరకు తన సోదరితో కలిసి ప్రచారం చేస్తున్నారాయన.

ఇక తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, చాలా కాలంగా సామాజిక సేవలో పాల్గొంటున్న తన సోదరికి మాత్రమే మద్దతు ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. పంజాబ్ లో కాంగ్రెస్ కి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీకి మరొకసారి అవకాశం ఇవ్వాలని అన్నాడు. చన్నీ ముఖ్యమంత్రిగా చాలా తక్కువ సమయమే పనిచేసినప్పటికీ చాలా ప్రశంసించదగ్గ పనులు చేశారని తెలిపారు సోనూ సూద్.

Tags

Read MoreRead Less
Next Story