అసెంబ్లీ టికెట్ అడగడంతో సోనూ రియాక్షన్..

అసెంబ్లీ టికెట్ అడగడంతో సోనూ రియాక్షన్..
అడిగిన వారందరికీ సాయం అందిస్తున్న సోనూకి ఈసారి ఒక వింత ప్రశ్న ఎదురైంది.. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో..

బాలీవుడ్ సోనూ సూద్ సేవా నిరతి కొందరికి ఆకతాయిగా ఉంది. వలస కార్మికులకు సహాయం చేసి అంతటితో చేతులు దులిపేసుకోలేదు.. తన సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు.. మహమ్మారి మధ్య తన సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేసిన అభ్యర్థనలకు తరచుగా స్పందిస్తుంటారు.

పని లేని వాళ్లంతా పిచ్చి పిచ్చి ట్వీట్లు పెడుతూ ఆయన టైమ్ ని వేస్ట్ చేస్తున్నా వాటిని అస్సలు పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుపోతున్నారు.. పైగా వాటికి తనదైన స్టైల్లో సరదాగా రిప్లైలు కూడా ఇస్తుంటారు. అడిగిన వారందరికీ సాయం అందిస్తున్న సోనూకి ఈసారి ఒక వింత ప్రశ్న ఎదురైంది.. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇప్పించరా ప్లీజ్ అంటూ ఓ ట్విట్టర్.. భాగల్పూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను.. దయచేసి టికెట్ ఇప్పించండి అని ఓ యూజర్ అడిగాడు.. దానికి సోనూ సూద్ అంతే ఆసక్తిగా సమాధానం ఇచ్చారు.

బస్సులు, రైళ్లు. విమానాల కోసం అయితే టిక్కెట్లు ఇప్పిస్తా కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇప్పించలేను భయ్యా.. అని సోను యూజర్ కి సమాధానం ఇచ్చారు. ఇంతకు ముందు కూడా మరో యూజర్ "సర్ ఆపిల్ ఐఫోన్ కావాలి నాకు .. నేను మీకు ఇప్పటికి 20 సార్లు ఇలా ట్వీట్ చేసాను"అని నవ్వుతూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేశాడు. అదే పంథాలో స్పందించిన సోను, "నాకు కూడా ఫోన్ కావాలి.. దానికి నేను మీకు 21 సార్లు ట్వీట్ చేయగలను" అని ట్వీట్ చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story