Sonu Sood: పిడికిలి తెరిచి చూడు.. నీ చేతి గీతల్లో ఎవరో ఒకరికి సాయం చేయాలని రాసే ఉంటుంది: సోనూ సూద్

Sonu Sood: పిడికిలి తెరిచి చూడు.. నీ చేతి గీతల్లో ఎవరో ఒకరికి సాయం చేయాలని రాసే ఉంటుంది: సోనూ సూద్
తాను చేస్తున్న సేవలు కొందరికి కంటకింపుగా మారినా అందులో వారు ఆనందం పొందుతున్నప్పడు మనం ఎందుకు కాదనాలి అని చిరునవ్వుతో సమాధానం చెబుతారు.

Sonu Sood: అమ్మ చెప్పిన ఆ మాటల్ని అక్షరాలా చేసి చూపిస్తున్నారు. తన సాయానికి రాజకీయ రంగులు అద్ధకుండా నిస్ఫక్షపాతంగా కుల, మత, వర్గ, బేధాలకు తావివ్వకుండా అందర్నీ ఆదుకుంటున్నారు. విలన్‌గా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా ఇప్పుడు రియల్ లైఫ్‌లో హీరో అయ్యారు.

ప్రతిభా పురస్కారాల్ని, పదవులను ఆశించకుండా కష్టపడుతున్నారు. తన సేవలను విస్తరిస్తున్నారు. తాను చేస్తున్న సేవలు కొందరికి కంటకింపుగా మారినా అందులో వారు ఆనందం పొందుతున్నప్పడు మనం ఎందుకు కాదనాలి అని చిరునవ్వుతో సమాధానం చెబుతారు.

మీలాంటి వాళ్లు దేశానికి ప్రధాని అయితే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ప్రజలు భావిస్తున్నారని అడగ్గా.. సామాన్యులతో కలిసి బతికినప్పుడే జీవితంలోని వాస్తవాలు తెలుసి వస్తాయని అన్నారు. అవసరంలో ఉన్న వారికి, మన అవసరం ఉన్నవారికి సాయం చేయడంకన్నా పెద్ద పదవి లేదని తెలిపారు.

చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు అనుక్షణం గుర్తు పెట్టుకుంటాను. పిడికిలి తెరిచి చూడా.. నీ చేతి గీతల్లో ఎవరో ఒకరికి సాయం చేయాలని రాసి ఉంటుంది అని ఆమె అనేవారు.

అదే నేను చేస్తున్నా. నా చేతిలో వీరందరికీ సాయం చేయాలని రాసి ఉంది అని అన్నారు. నేను నా సేవల్ని కొనసాగిస్తూనే ఉంటా.. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వంటి వాటితో నాకు సంబంధం లేదు. నేనో దారిని ఎంచుకున్నా.. ఎవరేమనుకున్నా ఆ దారిలో నేను వెళుతుంటా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.



మీపై వచ్చే మీమ్స్‌పై ఎలా స్పందిస్తారు అని అడిగితే.. ఆ మధ్య ఒకరు మద్యం దుకాణానికి తీసుకెళ్లమని అడిగారు. అందుకు సమాధానంగా దుకాణానికి మీరు వెళ్లండి. తాగి పడిపోతే మిమ్మల్ని ఇంటికి చేరవేస్తాను అని చెప్పా. ఇలా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్ట్‌‌కు నేనే స్వయంగా రిప్లై ఇస్తా. అది చూసి వాళ్లు హాయిగా నవ్వుకుంటారు. మా అమ్మ లిటరేచర్ ప్రొఫెసర్. అందుకే నాకు రాయడం కూడా తెలుసు అని అన్నారు.

ఒక రాజకీయ నాయకుడిగా ఉంటే ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. అదే ఇప్పుడైతే ఓ సామాన్యుడిలా ప్రతి గల్లీలోకి, కచ్చా రోడ్ల మీదకి కూడా వెళ్లగలను. రాజకీయాల్లోకి రావాలి అని బలంగా అనిపించినప్పుడు వస్తానేమో. ఇప్పుడైతే అలాంటి ఆలోచన అస్సలు లేదని అన్నారు.

ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారని అడిగితే.. అన్ని రాష్ట్రాలు నావే. పంజాబ్‌లో పుట్టా, మహారాష్ట్రలో పని చేస్తున్నా.. తెలుగు రాష్ట్రాల్లో నా మొదటి ఆక్సిజన్ ప్లాంట్ రానుంది. ఇవి కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలకూ విస్తరిస్తాయి. నాకు దేశమంతా ఒకటే అని అన్నారు.

కాగా, సోనూ ప్రస్తుతం సైన్ చేసిన సినిమాలు పృథ్విరాజ్ చౌహాన్ దర్శకత్వంలో ఒకటి, మరొకటి యశ్‌రాజ్, దక్షిణాదిలో చిరంజీవితో కలిసి ఆచార్యలో నటిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు చాలా వస్తున్నాయి. సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతాను. అడిగిన వారికి సాయం చేస్తూ ఆపన్నులకు అండగా ఉంటానని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story