డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బాలుకి నంది అవార్డు వచ్చిన చిత్రం

డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బాలుకి నంది అవార్డు వచ్చిన చిత్రం
మన్మథలీల చిత్రానికి తెలుగులో కమల్ హాసన్‌కు డబ్బింగ్ చెప్పడం ద్వారా ఆయన డబ్బింగ్ కెరీర్ మొదలైంది.

గాయకుడిగా క్షణం తీరిక లేకుండా ఉన్న బాలు డబ్బింగ్ ఆర్టిస్ట్ కావడం యాదృచ్ఛికంగా జరిగింది. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన మన్మథలీల చిత్రానికి తెలుగులో కమల్ హాసన్‌కు డబ్బింగ్ చెప్పడం ద్వారా ఆయన డబ్బింగ్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత రజనీకాంత్, విష్ణువర్థన్, సల్మాన్‌ఖాన్, కె. భాగ్యరాజాచ మోహన్, అనిల్ కపూర్, గిరీశ్ కర్నాడ్, జెమినీ గణేశన్, అర్జున్, నాగేశ్, కార్తీక్, రఘువరన్‌కు ఆయన డబ్బింగ్ చెప్పారు. దశావతారంలో కమల్ నటించిన ఏడు పాత్రలకు ఎస్పీబీ డబ్బింగ్ చెప్పడం విశేషం. అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించిన సుమన్‌కు డబ్బింగ్ చెప్పడం ద్వారా ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎస్పీబీ నంది అవార్డు గెలుచుకున్నారు. అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన గాంధీ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన కింగ్ బెన్‌స్లేకు ఎస్పీబీనే డబ్బింగ్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story