Amul: అమూల్ బేబీగా శ్రీవల్లి.. ఛీజ్ షేర్ చేస్తున్న పుష్పరాజ్..

Amul: అమూల్ బేబీగా శ్రీవల్లి.. ఛీజ్ షేర్ చేస్తున్న పుష్పరాజ్..
Amul: ఈ చిత్రంకి ఉన్న క్రేజ్ చూసి అమూల్ బేబీ కూడా ఆశ పుట్టింది. తాను శ్రీవల్లిగా మారిపోయింది.

Amul: పాత చింతకాయపచ్చడికి కాలం చెల్లింది.. ఇప్పుడంతా లేటెస్ట్ ట్రెండ్ నడుస్తోంది.. అమూల్ బేబీ కూడా అలానే ఆలోచించింది. శ్రీవల్లిగా మారిపోయింది.. నువ్ అమ్మీ అమ్మీ అంటాంటే నీ అలీ అనయిపోయినట్టుందిరా సామీ నా సామీ అని పుష్పరాజ్‌ని ఆటపట్టిస్తోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చిత్రంలోని సమంత ఐటెం సాంగ్ నుంచి అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ఈ చిత్రంకి ఉన్న క్రేజ్ నుంచి అమూల్ బేబీ కూడా ఆశ పుట్టింది. తాను శ్రీవల్లిగా మారిపోయింది.

ఎప్పుడూ అమూల్ వ్యాపార ప్రకటనలో చిన్నారులు ఉంటారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పుష్పరాజ్, శ్రీవల్లి కనిపించారు.. 'పుష్ప ది స్లైస్ పేరుతో అమూల్ హావ్ సమ్ అమ్ములు, అర్జున్'.. అంటూ కార్టూన్ షేర్ చేసింది. ఇక ఇది చూసిన బన్నీ.. అల్లు టు మల్లు టు అమ్ములు అర్జున్ అని కామెంట్ చేశాడు. బ్రాండ్ ప్రమోషన్ కోసం పుష్పరాజ్‌ని బాగానే వాడుకుంటున్నారంటూ అమూల్ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. కాగా పుష్ప ది రైజ్‌కి సీక్వెల్‌గా వస్తు్న్న పుష్ప ది రూల్ చిత్రాన్ని ఈ ఏడాది చివరి నాటికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story