Sruthy Sithara: ప్రవీణ్ నుంచి శ్రుతిగా మారి.. అంతర్జాతీయ అందాల పోటీలకు ఎంపికై..

Sruthy Sithara: ప్రవీణ్ నుంచి శ్రుతిగా మారి.. అంతర్జాతీయ అందాల పోటీలకు ఎంపికై..
ప్రపంచ వేదికపై నా దేశానికి మరియు నా సంఘానికి ప్రాతినిధ్యం వహించగలిగినందుకు నేను గర్వపడుతున్నాను, ”అని శ్రుతి చెప్పారు.

Sruthy Sithara: ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతోంది కేరళకు చెందిన శ్రుతి సితార. జూన్ 12 న లండన్‌లో ప్రారంభమయ్యే అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిద్యం వహించేందుకు మన దేశం తరపు నుంచి శ్రుతి సితార ఎంపికైంది. మహమ్మారి ముప్పు కారణంగా, ఇప్పటికే జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది.

"మిస్ ట్రాన్స్ గ్లోబల్ ఇండియా టైటిల్ గెలుచుకుంటానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది నా ట్రాన్స్‌జెండర్ సమాజానికి లభించిన ఒక గొప్ప అవకాశం. ప్రపంచ వేదికపై నా దేశానికి మరియు నా సంఘానికి ప్రాతినిధ్యం వహించగలిగినందుకు నేను గర్వపడుతున్నాను, "అని శ్రుతి చెప్పారు.

అందాల పోటీలో అనేక రౌండ్లు ఉంటాయి - పరిచయ రౌండ్‌తో ప్రారంభించి, ప్రశ్న, జవాబుల రౌండ్, టాలెంట్ రౌండ్ మరియు బికినీ రౌండ్లు. టాలెంట్ రౌండ్ కోసం ఆమె తన నటనా నైపుణ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది.

నా తల్లిదండ్రులు నా పరిస్థితిని అర్థం చేసుకున్నా సమాజం నన్ను చిన్నచూపు చూసింది అని తను ఎదిగిన క్రమంలో ఎదురైన అడ్డంకులను వివరించింది. అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారాలనే ఆలోచనలు రావడం, అందుకు నేను సిద్ధపడే క్రమంలో ఎన్నో ఆటు పోట్లు.. మరెన్నో అవమానాలు. స్కూలుకి, కాలేజీకి వెళ్లేటప్పుడు ఎన్నో ఇబ్బందులు. 9వ తరగతి చదువుతున్నప్పుడే శరీరంలో మార్పులు. అమ్మాయిల బట్టలు ధరించాలన్న కోరికలు. అమ్మాయిలా అలంకరించుకోవాలని ఆరాటం. స్నేహితుల అవహేళన.

కానీ అమ్మానాన్న, అన్నా వదిన అర్థం చేసుకున్నారు నా పరిస్థితిని. నేను అమ్మాయిగా మారేందుకు పూర్తి సహకారం అందించారు. డిగ్రీ చదువుకున్న శ్రుతి కేరళ ట్రాన్స్ జెండర్ సెల్‌కి అసిస్టెంట్‌గా ఎంపికైంది. జీవితమంతా నా చుట్టూ ఉన్న వారి నుంచి దాక్కుంటూ బ్రతకాల్సి వచ్చిందని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను.

ప్రస్తుతం నా డ్రీమ్ నటిగా మారాలని.. అంతర్జాతీయ వేదికపై ప్రపంచ సుందరి (ట్రాన్స్‌జెండర్) అవార్డు అందుకున్న తరువాత మలయాళ చిత్ర సీమలోకి అడుగుపెడుతోంది శ్రుతి. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. వాస్తవిక పాత్రలను సిల్వర్ స్క్రీన్ ద్వారా చూపించాలనుకుంటున్నాను అని ఆమె చెప్పింది. మలయాళ చిత్ర పరిశ్రమలో లింగమార్పిడి వ్యక్తులు చాలా మంది తెర వెనుక పని చేస్తుంటారు. కానీ తెరపై కనిపించేది చాలా తక్కువమంది. త్వరలో ఈ వ్యత్యాసంలో మార్పు వస్తుందని శ్రుతి ఆశిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story