సుప్రీంకోర్టులో పెగాసస్‌పై విచారణ

సుప్రీంకోర్టులో పెగాసస్‌పై విచారణ
Supreme Court:పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది లేనిది బయటపెట్టలేమని సుప్రీంకోర్టుకు చెప్పింది కేంద్రం.

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది లేనిది బయటపెట్టలేమని సుప్రీంకోర్టుకు చెప్పింది కేంద్రం. భద్రత దృష్ట్యా అన్ని వివరాలు వెల్లడించలేమని చెప్పుకొచ్చారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ప్రతి దేశం పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేస్తాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాము భద్రతా వివరాలు అడగటం లేదని, పెగాసెస్ టెక్నాలజీని వినియోగించారా లేదా అని మాత్రమే అడుగుతున్నామని కపిల్ సిబాల్ సూటిగా ప్రశ్నించారు.

దీనికి కౌంటర్‌గా ఇప్పటికిప్పుడు పెగాసస్‌పై బహిరంగంగా వివరాలు వెల్లడించలేమని, నిపుణల కమిటీ ముందు అన్ని విషయాలు చెబుతామని సొలిసిటర్ జనరల్‌ చెప్పుకొచ్చారు. ఆ కమిటీ అన్ని అంశాలు పరిశీలించి కోర్టుకు నివేదిక ఇస్తుందని సమాధానం ఇచ్చారు. దీంతో కేంద్రం, ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు.

పెగాసస్‌ పిటిషన్లపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యాకాంత్, జస్టిస్ అనిరుధా బోసే ధర్మాసనం రెండో రోజు విచారణ చేపట్టింది. ఈ రోజు వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story