సుప్రీంకోర్టులో కరోన.. సగం మంది వ్యాధిబారిన

సుప్రీంకోర్టులో కరోన.. సగం మంది వ్యాధిబారిన
కరోనా పట్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ముందు కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు కరోనాని పట్టించుకోకపోవడమే అసలు కారణమని తేలింది. ఇంతకు ముందు ఎక్కువ భయంతో ఎక్కువ శ్రద్ధపెట్టేవారు.

కరోనా పట్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ముందు కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు కరోనాని పట్టించుకోకపోవడమే అసలు కారణమని తేలింది. ఇంతకు ముందు ఎక్కువ భయంతో ఎక్కువ శ్రద్ధపెట్టేవారు.

ఇప్పుడు భయం తగ్గిపోవడంతో కేసులు శాతం కూడా పెరుగుతోందని అధికారులు వాపోతున్నారు. మాస్కులు ధరించట్లేదు సరికదా.. సామాజిక దూరం అసలే పాటించట్లేదు. దీంతో కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. ఇందుకు సామాన్యులతో అధికారులూ మినహాయింపు కాదు.

అందుకు నిదర్శనమే దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్డులో సగం మంది న్యాయమూర్తులు కరోనా బారిన పడ్డారు. దాదాపు 50 శాతం మంది కోవిడ్ బారిన పడినట్లు జాతీయ మీడియాలు పేర్కొంటున్నాయి. శనివారం ఒక్కరోజే 44 మంది సిబ్బందికి పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు మళ్లీ వర్చువల్ విధానంలో కేసుల విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వర్గాలు వెల్లడించాయి.

కరోనా కేసుల నేపథ్యంలో కోర్టు హాళ్లు, పరిసరాలను శానిటైజ్ చేస్తున్నారు. మరోవైపు నేడు పలు బెంచ్‌లు షెడ్యూలు సమయం కంటే గంట ఆలస్యంగా మొదలు కానున్నాయి. ఉదయం 10.30గంటలకు ప్రారంభమయ్యే బెంచీలు ఉదయం 11.30గంటలకు, 11గంటలకు మొదలయ్యే బెంచీలు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ ప్రారంభించనున్నాయని సుప్రీంకోర్టు అదనపు రిజిస్టార్ ఓ ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రీ ముందు అత్యవసర కేసుల ప్రస్తావన కూడా ఆన్‌లైన్‌లో చేయాలని వెల్లడించారు.

కాగా, దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజుకు లక్షన్నర కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. మహమ్మారి దృష్ట్యా ఇప్పటికే పలు రాష్ట్రాలు వీకెండ్ కర్ఫ్యూలు, లాక్టౌన్లు అమలు చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story