Supreme Court: పెగాసస్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Supreme Court: పెగాసస్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
Supreme Court on Pegasus: పెగాసస్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

Supreme Court on Pegasus: పెగాసస్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పెగాసస్‌ ఫోన్‌ హ్యాకింగ్‌పై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలిపారు. ఆగస్ట్ తొలి వారంలో పెగాసస్‌పై విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫోన్‌ హ్యాకింగ్‌పై విచారణ జరపాలంటూ సీనియర్ జర్నలిస్టులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీం.. విచారణకు అంగీకరించింది.

మరోవైపు ఫోన్ హ్యాకింగ్‌పై దర్యాప్తుకు ఆదేశించింది. బెంగాల్ ప్రభుత్వం. ఇప్పటికే పార్లమెంట్‌ సమావేశాలను పెగాసస్‌ అంశం కుదిపేస్తోంది. ఈ అంశంపై చర్చ జరగాలంటూ పట్టుబడుతున్నాయి. పెగాసస్‌పై జేపీసీ వేయాలంటూ విపక్షాల డిమాండ్‌ చేస్తున్నాయి. మొత్తానికి పెగాసస్‌ అంశం కేంద్ర ప్రభుత్వాన్ని అన్నివైపుల నుంచి చుట్టుముడుతున్నట్టు కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story