సుశాంత్ మరణానికి కొద్ది గంటల ముందు ఆ నలుగురు..

సుశాంత్ మరణానికి కొద్ది గంటల ముందు ఆ నలుగురు..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఒక మిస్టరీగా మిగిలింది. దాదాపు ప్రతి రోజు ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఒక మిస్టరీగా మిగిలింది. దాదాపు ప్రతి రోజు ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. సుశాంత్ తో పాటు ఉన్న నలుగురు వ్యక్తులలో ఒకరికైనా ఈ మరణంతో సంబంధం ఉండవచ్చనే అనుమానంతో సీబీఐ ఎంక్వైరీ చేపట్టింది. జూన్ 14 న బాంద్రా నివాసంలో సుశాంత్ అనుమానాస్పదస్థితిలో మరణించాడు. ఈ మరణంపై ప్రశ్నించేందుకు అతడితో పాటు ఉన్న ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ పిథాని, సిబ్బంది నీరజ్, కేశవ్, దీపేష్ సావంత్ లను సీబీఐ ప్రశ్నించింది. హెల్పర్ నీరజ్‌ను ఎనిమిది రోజులకు పైగా, సిద్ధార్థ్ ఏడు రోజులకు పైగా, హౌస్ కీపర్ దీపేశ్‌ను ఐదు రోజులకు పైగా, కేశవ్‌ను నాలుగు రోజులకు పైగా ఎంక్వైరీ చేశారు.

సుశాంత్ హత్య గురించి ఈ నలుగురికి తెలిసి ఉంటుందని సిబిఐ అనుమానిస్తుంది. ఇది ఆత్మహత్య అయితే వారిలో కనీసం ఒకరు కుట్రలో భాగం పంచుకుని ఉంటారని భావిస్తోంది. ఆ నలుగురు సుశాంత్ తన చివరి కొన్ని గంటలు ఎలా గడిపారో సిబీఐకి వివరించారు. దురదృష్టకరమైన సుశాంత్ మరణించిన రోజు ఉదయం, సుశాంత్ కుక్కను తీసుకొని వాకింగ్ కి వెళ్లి 8 గంటలకు తిరిగి వచ్చి తన గదిలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత గది నుంచి బయటకు వచ్చి నీరజ్ ను చల్లటి నీరు కావాలని అడిగాడు. సుశాంత్ నవ్వుతూ నలుగురినీ పలకరించి రూమ్ లోకి వెళ్లిపోయాడు.

నీరజ్.. సుశాంత్ గురించి చెబుతూ మంచి స్వభావం గల వ్యక్తి. అతను కలత చెందినప్పటికీ ఎవరిపైనా తన కోపాన్ని చూపించడు. జూన్ 13 రాత్రి సుశాంత్ భోజనం చేయలేదని, మామిడి జ్యూస్ మాత్రమే తీసుకున్నట్లు దీపేశ్ సీబీఐతో చెప్పాడు. సుశాంత్ సిబ్బందిలో దీపేశ్ తొందరగా మేల్కొన్నాడు. నీరజ్, కేశవ్ ఇద్దరూ ఉదయం 7 గంటలకు మేల్కొంటారు. ఉదయం 9.30 గంటల సమయంలో కేశవ్ సుశాంత్ కోసం జ్యూస్, కొబ్బరి నీళ్ళు, అరటిపండ్లు తీసుకుని గదికి వెళ్లాడు. కానీ అతడు జ్యూస్, కొబ్బరి నీళ్ళు మాత్రమే తీసుకున్నాడు. ఉదయం 10.30 గంటల సమయంలో కేశవ్ మళ్ళీ మేడపైకి వెళ్ళి సుశాంత్ ను ఏదైనా కావాలా అని అడిగి భోజనానికి ఏమి వండాలి అని అడిగడానికి కని వెళ్లాడు. కానీ సుశాంత్ గదికి లాక్ చేసి ఉన్నాడు అని చెప్పాడు.

"తరువాత, నేను సిద్ధార్థ్ సార్ కి తలుపు తెరవడం లేదని తెలియజేశాను. సిద్ధార్థ్ సార్ తలుపు తట్టి లోపలి నుండి లాక్ చేయబడిందని చెప్పాడు. రియా మేడమ్ అతనితో ఉన్నప్పుడు మాత్రమే సుశాంత్ సర్ తలుపు లాక్ చేస్తాడు. సుమారు 15 నిమిషాల తరువాత , సిద్ధార్థ్ సార్ మళ్ళీ తలుపు తట్టాడు, కాని స్పందన రాలేదు "అని కేశవ్ సీబీఐతో అన్నారు. నీరజ్ కూడా సిబిఐకి అదే మాట చెప్పాడు. క్రియేటివ్ ఆర్ట్ డిజైనర్, నటుడి స్నేహితుడు కేశవ్, దీపేశ్, సిద్ధార్థ్ అతనితో కలిసి ఉన్నారు. వారు కూడా మేడమీదకు వెళ్లి సుశాంత్ ఉన్న గది తలుపు తట్టడం ప్రారంభించారు. చాలా సేపు డోర్ కొట్టినా స్పందన లేదు. సిద్ధార్థ్ ఫోన్లో కూడా ప్రయత్నిస్తున్నాడు, కాని కాల్స్ కి కూడా సమాధానం ఇవ్వలేదు.

సుశాంత్ సోదరి మీతు సింగ్ కు విషయాన్ని వివరించారు. ఏదో విధంగా తలుపులు తెరవమని చెప్పి తాను త్వరగా అక్కడికి చేరుకుంటానని చెప్పింది. తరువాత, సిద్ధార్థ్ ఒక తాళాలు తీసే వ్యక్తిని తీసుకు వచ్చి డోర్ తీయించారు. సుశాంత్ గదిలోకి ప్రవేశించిన మొదటి వ్యక్తి సిద్ధార్థ్. కొంత సమయం తర్వాత లోపలికి వెళ్లి, మెడలో ఆకుపచ్చ కుర్తాతో సుశాంత్ సీలింగ్ ఫ్యాన్ నుండి వేలాడుతున్నట్లు నీరాజ్ చెప్పాడు. కుర్తా సుశాంత్‌కు చెందినది. నీరజ్ సిబిఐతో మాట్లాడుతూ తాను భయపడి గది నుండి బయటకు వచ్చాను అని చెప్పాడు.

సిద్ధార్థ్ మీతుకి సంఘటన గురించి ఫోన్లో చెప్పాడు. ఆ తర్వాత కుర్తా కత్తిరించడానికి చాకు తీసుకురావాలని నీరజ్‌ను కోరాడు. నీరజ్, సిద్ధార్థ్ కుర్తాను కత్తిరించి సుశాంత్ మృతదేహాన్ని కిందకు దించారు. మీతు అదే సమయంలో గదిలోకి ప్రవేశించి షాక్ లో అరిచింది. సిద్ధార్థ్ సుశాంత్ ఛాతీని బలంగా పంప్ చేయడం మొదలు పెట్టాడు. కానీ అప్పటికే ఊపిరి ఆగిపోయింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఇదిలావుండగా, సిబిఐ వరుసగా రెండో రోజు రియాను ప్రశ్నిస్తోంది. ఆగస్టు 28, శుక్రవారం ఆమెను 10 గంటలు ప్రశ్నించారు. ఆధారాల ప్రకారం, సుశాంత్ యొక్క మానసిక ఆరోగ్యం, ఆర్థిక, మాదకద్రవ్యాల ఆరోపణలపై రియాను సీబీఐ ప్రశ్నిస్తోంది. రియాకు సెక్యూరిటీ ఎస్కార్ట్ అందించాలని సిబిఐ శనివారం ముంబై పోలీసులకు లేఖ రాసింది.

Tags

Read MoreRead Less
Next Story