కేరళ గోల్డ్ స్కామ్‌లో సంచలన మలుపు..!

కేరళ గోల్డ్ స్కామ్‌లో సంచలన మలుపు..!
కేరళ గోల్డ్ స్కామ్‌లో సంచలన మలుపు తిరిగింది. ఈ కుంభకోణంలో సీఎం పినరయి విజయన్‌కు సంబంధం ఉందంటూ నిందితురాలు స్వప్న సురేశ్‌ బాంబు పేల్చింది

కేరళ గోల్డ్ స్కామ్‌లో సంచలన మలుపు తిరిగింది. ఈ కుంభకోణంలో సీఎం పినరయి విజయన్‌కు సంబంధం ఉందంటూ నిందితురాలు స్వప్న సురేశ్‌ బాంబు పేల్చింది. కేవలం సీఎం మాత్రమే కాదు ముగ్గురు క్యాబినెట్‌ మినిస్టర్లు సైతం గోల్డ్‌ స్కాం వెనక ఉన్నారంటూ నోరు విప్పింది. ఇందులో కేరళ అసెంబ్లీ స్పీకర్‌ కూడా ఉన్నారంటూ చెప్పడం ఈ స్కామ్‌లో మరో ట్విస్ట్. అసలే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ప్రతిపక్షాలకు ప్రధాన ఆయుధంగా మారింది. కేరళ కమ్యునిస్టు కుంభకోణంలో మునిగి తేలారంటూ బీజేపీ నేతలు అప్పుడే వాగ్భాణాలు కూడా సంధిస్తున్నారు. స్వప్న ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కేరళ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

యూఏఈ నుంచి 30 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో స్వప్న సురేష్, సందీప్ నాయర్ నిందితులుగా ఉన్నారు. వీటి విలువ 15 కోట్లు ఉంటుందని ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ గోల్డ్‌ స్కాంలో ఈడీ కూడా ఇన్వాల్వ్‌ అయింది. స్వప్న సురేశ్‌, సందీప్‌ నాయర్‌లను ప్రశ్నించిన ఈడీ.. 303 పేజీల ఛార్జిషీటు కూడా దాఖలు చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ చేయటంలో స్వప్న సురేష్ కీలక సూత్రధారి అని ఈడీ నిర్థారించింది. ఈ విచారణలో భాగంగానే.. గోల్డ్ స్కామ్‌ వెనక సీఎం విజయన్‌తో పాటు ముగ్గురు మంత్రులు ఉన్నారంటూ బాంబు పేల్చింది స్వప్న సురేశ్.

Tags

Read MoreRead Less
Next Story