Tamil Nadu CM Stalin : తమిళనాడు సీఎం స్టాలిన్ అనూహ్య నిర్ణయం..!

Tamil Nadu CM Stalin : తమిళనాడు సీఎం స్టాలిన్ అనూహ్య నిర్ణయం..!
Tamil Nadu CM Stalin : కరోనాపై పోరులో భాగంగా ఏర్పాటు చేసిన సలహా కమిటీలో అన్నాడీఎంకే నేత, రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ కు చోటు కల్పించారు.

Tamil Nadu CM Stalin : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అనూహ్య నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. కరోనాపై పోరులో భాగంగా ఏర్పాటు చేసిన సలహా కమిటీలో అన్నాడీఎంకే నేత, రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ కు చోటు కల్పించారు. 13 మందితో కూడిన ఈ ప్యానెల్ లో శాసనసభ ప్రాతినిథ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు ఉన్నారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా స్టాలిన్ ఉంటారు. మే 13 న జరిగిన కోవిడ్ సంక్షోభం యొక్క అఖిలపక్ష సమావేశంలో ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా ఎంకే స్టాలిన్ ఈ బహుళ పార్టీ సలహా కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని కోవిడ్ -19 పరిస్థితి ప్రకారం ఎప్పటికప్పుడు బహుళ పార్టీ సలహా కమిటీ సమావేశమవుతుంది. ఈ నిర్ణయంతో ప్రతీకార రాజకీయాలకు దూరం జరుగుతున్నానని సంకేతాలిచ్చారు స్టాలిన్. కాగా ఆదివారం, తమిళనాడులో కొత్తగా 33,181 కోవిడ్ -19 కేసులు, 311 మరణాలు, 21,317 రికవరీలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2,19,342 యాక్టివ్ కేసులున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story