కార్తీకమాసంలో శుభకార్యాలు.. మరో ఆరోనెలల వరకు మంచి ముహూర్తాలు..

కార్తీకమాసంలో శుభకార్యాలు.. మరో ఆరోనెలల వరకు మంచి ముహూర్తాలు..
కరోనా ఫీవర్ నుంచి కాస్త కోలుకున్న ప్రజలు మంచి ముహూర్తం మళ్లీ రాదని..

పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటారు. ఈ మాసంలో తెలుగింటి లోగిళ్లు దీప కాంతులతో కళకళలాడుతుంటాయి. ప్రతి ఇల్లూ దేవాలయాన్ని తలపిస్తుంది. వ్రతాలు, నోములు, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు.. ఒకటేమిటి ఇలా అన్ని శుభకార్యాలకు ఈ మాసం ప్రత్యకం. కరోనా ఫీవర్ నుంచి కాస్త కోలుకున్న ప్రజలు మంచి ముహూర్తం మళ్లీ రాదని అబ్బాయి/అమ్మాయికి పెళ్లి చేసేందుకు ఆరాటపడుతున్నారు. జనవరి 6 దాకా శుభ ముహూర్తాలు ఉన్నా కార్తీకమాసంలో పెళ్లిళ్లు జరపడానికే ప్రాధాన్యమిస్తుంటారు.

దీనికి తోడు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 11 దాకా పుష్యమాసంలో గురుమూఢం ఉంది. ఫిబ్రవరి 12 నుంచి మాఘమాసం మొదలైనా మూఢం కొనసాగుతున్నందున పెళ్లిళ్లకు ఆస్కారం లేదు. ఏప్రిల్ 13న చైత్రమాసం ఉగాదితో ప్లవనామ సంవత్సరం మొదలైనా పెళ్లి ముహూర్తాలు లేవు. ఈ లెక్కన వచ్చే నెలరోజుల్లో చేయలేకపోతే తర్వాత దాదాపు మరో 6 నెలలు.. అంటే మే 12న వైశాఖం మొదలయ్యేదాకా మంచి ముహూర్తాలు ఉండవని ఆ శుభకార్యం ఏదో ఇప్పుడే జరిపించేద్దామని అనుకుంటున్నారు.

కరోనా భయంతో గత నెల నిజ ఆశ్వయుజ మాసంలో శుభ ముహూర్తాలు ఉన్నా చాలా మంది పెళ్లిళ్లు చేయడానికి ధైర్యం చేయలేకపోయారు. కార్తీక మాసంలో చేయొచ్చని వాయిదా వేసుకున్నారు. దీంతో ఉపాధి లేక ఇబ్బంది పడ్డ పురోహితులను ఈ మాసం ఆదుకుంటుందని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story