స్నేహమంటే అదీ.. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి ఇల్లు బహుమతి

స్నేహమంటే అదీ.. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి ఇల్లు బహుమతి
దీపావళికి కొత్త ఇల్లు కొని బహుమతిగా అతడి కళ్లలో కాంతిని నింపాడు.. నిజమైన స్నేహానికి నిదర్శనంగా నిలిచాడు.

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..నిజమని నిరూపించారు తమిళనాడుకు చెందిన ఈ స్నేహితులు. కలిసి చదువుకున్న స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసింది.. ఉండడానికి ఇల్లు కూడా లేని దీనస్థితిలో ఉన్నాడని తెలిసి అతడి మనసు ఊరుకోలేకపోయింది.. దీపావళికి కొత్త ఇల్లు కొని బహుమతిగా అతడి కళ్లలో కాంతిని నింపాడు.. నిజమైన స్నేహానికి నిదర్శనంగా నిలిచాడు. తమిళనాడు పుదుకొట్టె జిల్లాకు చెందిన నాగేంద్రన్, ముత్తుకుమార్‌లు పాఠశాలలో కలిసి చదువుకున్నారు.

44 ఏళ్ల ముత్తుకుమార్ లారీ డ్రైవర్. కరోనా మహమ్మారి కారణంగా విధించిన టాక్డౌన్‌‌లో అతడు తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడు నెలకు 15వేల రూపాయలు సంపాదించేవాడు. అలాంటిది లాక్డౌన్లో అతడి ఆదాయం 2వేల రూపాయలకు పడిపోయింది. దీంతో అతడికి కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. దీనికి తోడు అకాల వర్షాల కారణంగా అతడి ఇల్లు కూడా పూర్తిగా దెబ్బతింది.

30 ఏళ్ల తరువాత సెప్టెంబరులో స్నేహితుడు ముత్తుకుమార్‌ని కలుసుకున్నాడు నాగేంద్రన్. తమ పాఠశాల ఉపాధ్యాయుడి నివాసమైన రీయూనియన్‌లో కలిశారు స్నేహితులు. సమావేశం తరువాత, ముత్తుకుమార్.. నాగేంద్రన్‌ని తన ఇంటికి ఆహ్వానించాడు. నాగేంద్రన్ తన స్నేహితుడి ఇంటి పరిస్థితిని చూసి చాలా కలత చెందాడు. ముత్తుకుమార్ మాట్లాడుతూ, నేను పుట్టినప్పటి నుండి ఒకే ఇంట్లో నివసిస్తున్నాను. రెండు సంవత్సరాల క్రితం తుఫాను సమయంలో ఇంటి మీద చెట్లు పడి ధ్వంసమైంది. అప్పటి నుంచి బాగు చేయించుకుందామన్నా చేతిలో అంత డబ్బు లేదు.

నాగేంద్ర‌న్ స్నేహితుడి ఇల్లు చూసి వాట్సాప్ గ్రూపును సృష్టించి దాని ద్వారా నిధులు సమకూర్చారు. అతను తన టిఇసిఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్ పుదుకొట్టైలో చదువుకున్న స్నేహితులతో కలిసి వాట్సాప్ గ్రూప్‌లో ముత్తుకుమార్ ఇంటికి నిధులు సమకూర్చడానికి ఒక సందేశాన్ని పంపాడు. నాగేంద్ర మాట్లాడుతూ, నేను పాఠశాల పూర్తి చేసిన 30 సంవత్సరాల తరువాత నా స్నేహితుడిని కలిశాను.

అతని ఇంటి పరిస్థితి చూసి నేను బాధపడ్డాను. గాజా తుఫాను కారణంగా అతని ఇల్లు, ఇంటి పైకప్పు ధ్వంసమయ్యాయి. నేను అతనికి సహాయం చేయాలని భావించాను. ఒక వాట్సాప్ సమూహాన్ని సృష్టించాను. ముత్తుకుమార్ ఇంటికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను పంపించాను. దీంతో అతనికి సహాయం చేయడానికి చాలా మంది స్నేహితులు ముందుకు వచ్చారు.

దీపావళి గిఫ్ట్ హౌస్

నాగేంద్రన్, అతని స్నేహితులు కలిసి కేవలం మూడు నెలల్లో ఒక్క ఇంజనీర్ సహాయం కూడా లేకుండా లక్షా యాభైవేల వ్యయంతో ముత్తుకుమార్‌ కోసం ఇల్లు నిర్మించారు. ముత్తుకుమార్ మరియు అతని కుటుంబ సభ్యులకు దీపావళి కానుకగా ఆ ఇంటిని వారికి అప్పగించారు. ఇది మాత్రమే కాదు, అతను ముత్తు తల్లి కోసం సమీపంలో ఒక చిన్న గుడిసెను కూడా నిర్మించాడు. నాగేంద్రన్ మాట్లాడుతూ, మేము దాదాపు 30 సంవత్సరాలు కలుసుకోలేనప్పటికీ, పాఠశాల స్నేహితులు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనవారు. మనమందరం అవసరమైన మన స్నేహితులకు సహాయం చేయాలి అని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story