Twitter : భారత్ కు ట్విట్టర్ రూ.110 కోట్ల సాయం

Twitter : భారత్ కు ట్విట్టర్ రూ.110 కోట్ల సాయం
దేశంలో కోవిడ్-19ను ఎదుర్కొనేందుకుగాను పాటుపడుతున్న మూడు ఎన్జీవో సంస్థలకు ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు ట్విట్టర్ సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే తెలిపారు.

భారత్ లో కరోనా కట్టడి చర్యలకు ట్విట్టర్ సుమారు రూ.110 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దేశంలో కోవిడ్-19ను ఎదుర్కొనేందుకుగాను పాటుపడుతున్న మూడు ఎన్జీవో సంస్థలకు ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు ట్విట్టర్ సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే తెలిపారు. ఆక్సిజన్, పీపీ ఈ కిట్స్, మందుల కొనుగోలుకు కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో కేర్‌ ఎన్జీవోకు 10 మిలియన్‌ డాలర్లు కేటాయించగా.. మిగతా రెండు సంస్థలకు 2.5 మిలియన్‌ డాలర్ల చొప్పున విరాళమిచ్చారు.


Tags

Read MoreRead Less
Next Story