కొత్త స్ట్రెయిన్ వేగంగా.. బ్రిటన్‌లో 1000 కేసులు..

కొత్త స్ట్రెయిన్ వేగంగా.. బ్రిటన్‌లో 1000 కేసులు..
కోవిడ్ కంటే 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందనే వార్తలు ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తున్నాయి.

కరోనా కలవరింతలతో పోయిన ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాది కొత్త స్ట్రెయిన్ భయపెడుతోంది. బ్రిటన్‌లో కనిపించిన ఈ కొత్త వైరస్ అత్యంత వేగంగా 30 దేశాలకు విస్తరించింది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని సంబరపడేలోపు మరో కొత్త తలనొప్పి మొదలైంది. ఇప్పటికే అప్రమత్తమైన ప్రపంచదేశాలు తన దేశంలోకి ఈ కొత్త వైరస్ ప్రవేశించకుండా అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కఠిన నిబంధనల అమలు చేస్తున్నారు. కోవిడ్ కంటే 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందనే వార్తలు ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తున్నాయి.

వియత్నాం, యూకేలో పలువురు వైరస్ బారిన పడ్డారు. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులను క్యాన్సిల్ చేసింది. జనవరి 1న టర్కీలో 15మంది ఈ వైరస్ బారిన పడినట్లు గుర్తించారు. డచ్‌లోనూ స్ట్రెయిన్ కేసులు బయటపడ్డాయని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి హ్యూగో డి జోంగే వెల్లడించారు. ఆమ్‌స్టర్‌డాం ప్రాంతంలో ఇద్దరికి స్ట్రెయిన్ సోకినట్లు ఆయన తెలిపారు. అలాగే ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా, చైనా, కెనడాలోనూ కేసులు వెలుగు చూశాయి.

అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడాలో స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో అత్యధికంగా 1000 స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. కాగా భారత్‌లోనూ 29 స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. అయితే గత వైరస్ కన్నా ప్రాణాంతకం కాదని వైద్యులు చెబుతుండడం కాస్త ఉపశమనం కలిగించే విషయం.

Tags

Read MoreRead Less
Next Story